Sun. Dec 22nd, 2024
Pumpkin-halwa

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 11,2022: గుమ్మడి కాయ హల్వా లేదా కద్దు కా హల్వా అనేది భారతీయ పుడ్డింగ్ డెజర్ట్ రిసిపి, ఇది పసుపు లేదా ఎరుపు గుమ్మడికాయ, పాలు , చక్కెరను ఉదారంగా నెయ్యి జోడించడం ద్వారా తయారు చేయవచ్చు.

గుమ్మడికాయ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు

-ఒక కిలో, గుమ్మడికాయ (1 డైస్‌లుగా కట్ చేసి),తోలు ఒలిచినది -150 ml నీరు -150 గ్రాముల చక్కెర -4 tsbp వెన్న / నూనె / స్వచ్ఛమైన నెయ్యి
-50 గ్రాముల ఎండుద్రాక్ష
-2 టేబుల్ స్పూన్లు కొబ్బరి (తురిమిన), వేయించిన
-2 టేబుల్ స్పూన్లు బాదం (పొరలుగా), వేయించిన

గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేయాలి?

మొదటి దశ, ఒక saucepan లో గుమ్మడికాయ ముక్కలు కొంచం నీరు,దాల్చిన చెక్క కలిపి ఉంచాలి ఆ పాన్ పై మూతపెట్టి మెత్తబడే వరకు ఉడికించాలి. ఉడికిన గుమ్మడికాయ ముక్కలను వడకట్టి మెత్తగా చేయాలి.

రెండవ దశ, ఒక పెద్ద పాన్‌లో, 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడి అయై వరకు చూడండి

మూడవ దశ, నూనె కాగిన తరువాత గుమ్మడికాయ మెత్తగా చేసిన ముద్దను జోడించండి.

నాల్గవ దశ, సుమారు 10 నిమిషాల పాటు గుమ్మడికాయ నూనెలో బాగా చిక్కగా ,ముదురు అయ్యే దాకా కలుపుతూ ఉండాలి .

ఐదవ దశ, బాగా ముదురు రంగు వచ్చాక కిందకు దింపే ముందు తగినంత చక్కెరను కలపండి. చక్కెర బాగా కలసి అంత దగ్గరగా వచ్చినాక హల్వా మిశ్రమంగా మారే వరకు ఉడికించడం జరుగుతుంది . హల్వా అంత దగ్గరకు అయ్యిపోయినాక పొయ్యి మిడి నుంచి దించుకోవాలి .

చివరగా సర్వింగ్ డిష్‌లో వేసి వేడిగా సర్వ్ చేసి, ఎండుద్రాక్ష, కొబ్బరి ,బాదంపప్పులతో అలంకరించుకోవచ్చు .

error: Content is protected !!