365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 15,2023: దోమల నివారణకు చిట్కాలు: ఇటీవల దోమలు వర్షాకాలం,వేసవి కాలం అని తేడాలేకుండా విపరీతంగా దోమల బెడద పెరిగిపోయింది. రాత్రి అవ్వగానే ఈ దోమలకారణంగా నిద్ర కూడా పట్టదు.
దోమల బెడదతో అనేక వ్యాధులు తలెత్తుతున్నాయి. దోమల భయాందోళనలను వదిలించుకోవటానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

దోమలను వదిలించుకోవడానికి మార్గాలు
వేప- కొబ్బరి నూనె..
దోమల బెడద నుంచి బయటపడేందుకు, ఒక గిన్నెలో కొబ్బరి నూనె ,వేపఆకు పేస్ట్ ను సమాన పరిమాణంలో కలపండి. రాత్రి పడుకునే ముందు చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కొని ఆ ద్రావణాన్ని రాసుకున్న తర్వాత నిద్రకు ఉపక్రమించాలి. దీని తర్వాత దోమలు మిమ్మల్ని కుట్టవు.
గుగ్గిలంతో ధూపం..
మీరు దోమలను తరిమికొట్టడానికి గుగ్గిలం ధూపాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం సాయంత్రం పూట పూజగదిలో దీపం వెలిగించి గుగ్గిలం ధూపాన్ని వెలిగించాలి. దాని నుంచి వెలువడే పొగ వాతావరణాన్ని సువాసనగా ఉంచుతుంది. తద్వారా దోమలతో సహా ఇతర హానికరమైన కీటకాలు పారిపోతాయి.
కర్పూరం వెలిగించండి..

దోమల బెడదను నివారించడానికి నిద్రపోయే ముందు కర్పూరాన్ని వెలిగించండి. ఆ తరువాత, ఆ గదిని 20 నిమిషాలు మూసివేయండి. దీని తరువాత తలుపు తెరిచినప్పుడు, దోమలు పారిపోతాయి
నిమ్మ గడ్డి నూనె..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, పొగ లేకుండా దోమలను తరిమికొట్టాలంటే నిమ్మ గడ్డిని వాడవచ్చు. ఈ గడ్డిని కొద్దిగా కాల్చి ఒక మూలలో వదిలేయండి. దాని నుంచి వెలువడే పొగ ఇంట్లో నూనె డిఫ్యూజర్‌గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సువాసన వెదజల్లడంతోపాటు దోమలు కూడా రావు.