365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,నవంబర్ 8,2022: మాంసాహార ప్రియులు చికెన్, మటన్ తిన్నంత ఇష్టంగా చేపలు తినరు. ఎందుకంటేదానికి ప్రధాన కారణం ఉంది. అదేంటంటే చేపలో ఉండే ముల్లు. చేపలకూర తినే సమయంలో ప్రమాదవశాత్తు గొంతులో గుచ్చుకుంటాయేమో నని కొందరు భయపడుతుంటారు. ఒకవేళ చేపముల్లు గొంతులో గుచ్చుకున్నా ఎలాంటి ఇబ్బందీ లేకుండా తొలగించడం చాలా సులువు. అందుకోసం పలురకాల చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..!
చేపముల్లు గొంతులో ఇరుక్కుంటే ఆ బాధ భయంకరంగా ఉంటుంది. ఫిష్ బోన్ గొంతులో గుచ్చుకుంటే తీవ్రంగా నొప్పి వస్తుంది. అంతేకాదు నమిలి తినే సమయంలోనే కాకుండా మింగేటప్పుడు విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఆ సమయంలో ఏం చేయాలో తోచక చాలామంది కంగారు పడుతుంటారు. మీ గొంతులో ఇరుక్కున్న చేప ముల్లును ఈజీగా తొలగించడానికి ఇంటి వద్దనే పలురకాల చిట్కాల ద్వారా ప్రయత్నించవచ్చు.
గొంతు లోపలి చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి చిన్న ముల్లు గుచ్చుకున్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అటువంటి సమయంలో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని బాగా నమిలి మింగాలి. అప్పుడు ముల్లు కడుపు లోపలికి వెళుతుంది. అంతేకాదు బ్రౌన్ బ్రెడ్ ముక్కను తీసుకుని దానికి రెండు వైపులా పీనట్ బటర్ రాయాలి. అనంతరం బ్రెడ్‌ను నోట్లో పెట్టుకుని మెత్తగా అయ్యేవరకు అలాగే ఉండాలి. అనంతరం దాన్ని నమలకుండా మింగాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో ఆ బ్రెడ్‌కు అతుక్కుని ముల్లు లోపలికి పోతుంది.
చేపముల్లు గొంతులో ఇరుక్కుంటే వండిన అన్నాన్ని ఒక కప్పు మోతాదులో తీసుకుని దాన్ని అలాగే నమలకుండా మింగేయాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో గొంతులో ఉన్న ముల్లు సులువుగా వచ్చేస్తుంది. ఒక అరటి పండు తీసుకుని సగానికి కొరికి నమలకుండానే అలాగే దాన్ని మింగాలి. అనంతరం నీరు తాగాలి. ఇలా చేస్తే గొంతులో ఉన్న చేపముల్లు ఈజీగా పోతుంది. చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే పొట్ట మీద గట్టిగా ఒత్తాలి. ఇలా చేయడం వల్ల గాలి అన్నవాహికకు ప్రసారమవుతుంది.
అదే పనిగా ఒత్తుతూ ఉంటే గాలికి ఆ ముల్లు బయటకు వస్తుంది. లేదంటే లోపల జీర్ణాశయంలోనికి చేరుతుంది. అక్కడికి చేరితే ఇబ్బందేమీ ఉండదు. ఎలాంటి పదార్థన్నయినా అరిగించే శక్తి మన కడుపులో ఉన్నయాసిడ్‌కు ఉంటుంది. చేప ముల్లు గొంతులో ఇరుక్కుపోయిన వ్యక్తిని ఒంగోమని చెప్పాలి. ఎవరైనా ఆ వ్యక్తుల వీపుపై కొట్టాలి.
ఇలా చేయడం వల్ల చేప ముల్లు బయటకు వస్తుంది. ఆ సమయంలో నోరు తెరచి ఉంచాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతే తప్పనిసరిగా డాక్టర్ వద్దకు వెళ్ళాలి. లేదంటే లోపల చేప ముల్లు గుచ్చుకున్న ప్రాంతంలో గాయమై ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.