Thu. Nov 21st, 2024
pf365telugu

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి15,2023: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO)నగదు డ్రా చేసుకోవాలా..? ఏదైనా పని చేయవలసి వచ్చినా దాదాపు ప్రతి పనికి డబ్బు అవసరం.

ఇంటికి రేషన్ తీసుకురావడం దగ్గర నుంచి మీకు అవసరమైన వస్తువులను కొనడం వరకు అన్నిటికీ డబ్బు అవసరమే.

అయితే ఒకేసారి ఎక్కువ డబ్బు అవసరమయిన సందర్భాల్లో ఉద్యోగం చేసే వ్యక్తి తన పీఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్‌గా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ డబ్బు 72 గంటల్లో మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అందుకు ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు తెలుసు కుందాం..

72 గంటల్లో ఖాతాలో నగదు..

వాస్తవానికి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే EPFO ​​ద్వారా కోవిడ్ పీరియడ్ కారణంగా, ఉద్యోగులు తమ PF ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అడ్వాన్స్ ఆప్షన్‌ను ఎంచుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇందులో 72 గంటల్లో డబ్బు జమ అవుతుంది.

pf365telugu

అడ్వాన్స్ నగదును ఎలా విత్ డ్రా చేసుకోవాలి.?

-దీని కోసం మీరు EPFO ​​unifiedportal-mem.epfindia.gov.in/memberinterface అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

-ఇప్పుడు మీ UAN నంబర్, పాస్‌వర్డ్ , క్యాప్చా కోడ్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి.

  • ఆ తరువాత ‘ఆన్‌లైన్ సర్వీసెస్ ఫారం 31, 19, 10C అండ్ 10D’ ఎంపికపై క్లిక్ చేయండి.

-ఇప్పుడు మీ PF ఖాతాకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయడం ద్వారా దాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది.

-అనంతరం ‘సర్టిఫికేట్ ఆఫ్ అండర్‌టేకింగ్’పై క్లిక్ చేసి, ‘ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్’ ఎంచుకోండి.

  • ‘కోవిడ్ అడ్వాన్స్’ ఎంపికను ఎంచుకుని, మీ పూర్తి చిరునామాను యాడ్ చేయండి.

ఇప్పుడు పాస్‌బుక్ లేదా చెక్‌బుక్ స్కాన్ చేసిన కాపీని జత చేసి, నిబంధనలు, షరతులపై క్లిక్ చేసి, మొబైల్ నంబర్‌ కు వచ్చిన OTPని నమోదు చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.. అంతే..!

error: Content is protected !!