365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 1,2025:అమీన్‌పూర్ పెద్ద చెరువు పరిధిలో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) నిర్ధారణ పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అక్రమ వసూళ్లపై హైడ్రా కఠిన హెచ్చరిక
*అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల – జేఏసీ పేరిట కొంత మంది వ్యక్తులు చెరువు పరిధిలో అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి.
Smt. Priyadarshini Gaddam Appointed as Director (Personnel) at NMDC
Read this also…Axis Bank Honors SPLASH 2025 Winners, Celebrating Young Talent in Art, Craft & Literature
ఇది కూడా చదవండి…90ల తరం అందాల తార రంభ రీ ఎంట్రీకి సిద్ధం..
*బాధితులు శనివారం హైడ్రా కమిషనర్‌ను కలిసి, వసూళ్లకు సంబంధించిన రసీదులు, వాట్సాప్ సందేశాలను చూపించారు.

*ఈ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
- బాధితులకు హైడ్రా సూచన – అక్రమ వసూళ్లు చేపట్టినవారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
*చెరువు పరిధిలో నీట మునిగిన ప్లాట్ల యజమానులు ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఎఫ్‌టీఎల్ నిర్ధారణ – నిష్పక్షపాత విధానం
- ప్రస్తుతం 95 ఎకరాలుగా ఉన్న చెరువు 450 ఎకరాలుగా ఎలా విస్తరించిందనే విషయంపై హైడ్రా లోతైన అధ్యయనం చేస్తోంది.
*గ్రామ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇమేజీలు పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష అనంతరం ఎఫ్‌టీఎల్‌ను ఖరారు చేస్తామని తెలిపారు.
Read this also…90s Icon Rambha Set for a Spectacular Silver Screen Comeback
ఇది కూడా చదవండి…మార్చి 1న ZEE5, ZEE తెలుగులో ప్రీమియర్ అవుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
*జేఎన్‌టీయూ, ఐఐటీ కళాశాలల భాగస్వామ్యంతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసి, నిర్ధారణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామన్నారు.

*ఈ ప్రక్రియ రెండు నుంచి మూడు నెలల్లో పూర్తి కానుందని, ఎవరూ అజాగ్రత్తగా వ్యవహరించకుండా ఓర్పుగా ఉండాలని సూచించారు.
జేఏసీ పేరిట అక్రమ వసూళ్లు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
*అమీన్‌పూర్ చెరువు ముంపు బాధితుల – జేఏసీ సభ్యత్వానికి రూ.1000 చెల్లించాలి, గజానికి రూ.500 చొప్పున చెల్లిస్తే ప్రభుత్వ శాఖల ద్వారా సర్దుబాటు చేయిస్తామంటూ కొందరు వసూళ్లకు పాల్పడుతున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి.
ఇది కూడా చదవండి…హైడ్రా కమిషనర్ చెరువుల సందర్శన – పునరుద్ధరణ పనులపై సమీక్ష
Read this also…Strand Life Sciences Unveils StrandOmics for Rare Disease Diagnosis
*జేఏసీ ఛైర్మన్‌గా నండూరి సత్యనారాయణ అనే వ్యక్తి రసీదు పుస్తకం ముద్రించి, అక్రమ వసూళ్లను చేపట్టుతున్నట్టు బాధితులు ఆరోపించారు.
*ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ అక్రమంగా డబ్బులు చెల్లించవద్దని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.

*చెరువు నీట మునిగిన ప్లాట్ల రక్షణ పేరుతో వసూళ్లు చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో, అమీన్‌పూర్ చెరువుకు సంబంధించి హైడ్రా చేపడుతున్న చర్యలు పూర్తి అయ్యేంతవరకు బాధితులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని హైడ్రా అధికారులు సూచించారు.