Mon. Dec 23rd, 2024
Husband-killed-wife-with-gu

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కర్నాటక,ఆగష్టు 14,2022:పెళ్లి మంత్రాల్లో ఏడడుగులు కలిసి నడుస్తానంటూ.. భార్య, భర్త ప్రమాణాలు చేస్తారు.. కష్టాల్లో అయినా.. సుఖాల్లో అయినా అనుక్షణం ఒకరినొకరు కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవనం సాగిస్తామంటూ చేసిన ఆ ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నారు కొందరు.

ఎంతో ఆప్యాయంగా చూసుకోవాల్సిన తమ జీవిత భాగస్వాములను మట్టుబెడుతు న్నారు. కట్టలు తెంచుకున్న కోపంలో భార్యనే గన్ తో కాల్చి చంపేశాడు ఓ భర్త. ఈ ఘటన కర్ణాటకలోని కొడగు సోమవారపేట తాలూకా బెట్టళ్లి గ్రామంలో జరిగింది. కిషన్‌ అలియాస్‌ గోపాల్‌–చస్మా దంపతులు గొడవ పడ్డారు. ఆవేశంతో కిషన్‌ తన వద్ద ఉన్న గన్ తో చస్మాపై కాల్పులు జరిపాడు.

దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య మస్పర్థల కారణంగా గొడవ పడుతుండేవాళ్లు. అనేక సార్లు పెద్దలు సైతం వారిద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

Husband-killed-wife-with-gu

ఇటీవల మరోసారి భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన భర్త కిషన్ క్షణికావేశంలో భార్యను గన్ తో కాల్చి చంపాడు. ఈ దాడిలో భార్య చస్మా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

అయితే కుటుంబ కలహాల కారణంగానే భర్త ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమాని స్తున్నారు.

error: Content is protected !!