365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 8,2025: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల (Bye-Elections to 61-Jubilee Hills AC) నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి వీలుగా, తెలంగాణ ఎక్సైజ్ చట్టం, 1968లోని సెక్షన్ 20 ప్రకారం, నియోజకవర్గం పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు (Liquor Shops), బార్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు ఇతర మద్యం విక్రయ కేంద్రాలను మూసివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.
మద్యం నిషేధం తేదీలు, సమయాలు ఇవే..
పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలను అనుసరించి, మద్యం విక్రయాలపై ఈ కింది విధంగా పూర్తి నిషేధం అమల్లో ఉంటుంది.
పోలింగ్ రోజుకు ముందు (09-11-2025 నుంచి):

తేదీ: 09-11-2025 (శనివారం) సాయంత్రం 6:00 గంటల నుంచి
తేదీ: 11-11-2025 (సోమవారం) సాయంత్రం 6:00 గంటల వరకు.
ఓట్ల లెక్కింపు రోజు (14-11-2025):
తేదీ: 14-11-2025 (గురువారం) ఉదయం 6:00 గంటల నుంచి
తేదీ: 15-11-2025 (శుక్రవారం) ఉదయం 6:00 గంటల వరకు.

నాన్-ప్రొప్రైటరీ క్లబ్‌లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర హోటళ్లలో మద్యం కలిగి ఉండటానికి సరఫరా చేయడానికి వివిధ కేటగిరీల లైసెన్సులు ఉన్నప్పటికీ, ఆయా ప్రాంతాల్లో కూడా ఈ నిషేధం వర్తిస్తుంది.
ఈ నిషేధాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఉప ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసమే ఈ ‘డ్రై డేస్’ అమలు చేస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు.
