365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైద‌రాబాద్‌, మార్చి 25,2025: న‌గ‌రంలో వ‌ర్షాకాలంలో తలెత్తే సమస్యలు, అగ్ని ప్ర‌మాదాల నివారణపై హైడ్రా – జీహెచ్‌ఎంసీ ప్ర‌త్యేక దృష్టి సారించింది. మంగ‌ళ‌వారం జీహెచ్‌ఎంసీ కార్యాల‌యంలో క‌మిష‌న‌ర్లు ఏవీ రంగ‌నాథ్‌, కె. ఇలంబ‌ర్తి అధ్వ‌ర్యంలో ఉన్న‌త స్థాయి స‌మీక్ష జ‌రిగింది.

వ‌ర్షాకాలం ముంచుకొస్తుండ‌టంతో వరద ముప్పు, ట్రాఫిక్ సమస్యలు, అగ్ని ప్రమాదాల నివారణపై ఇరు విభాగాల అధికారులు సమీక్షించుకున్నారు.

క‌మిటీలు ఏర్పాటు

  • అగ్ని ప్ర‌మాదాల నివారణకు ఫైర్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • వ‌ర్షాకాలంలో వరద ముప్పు నివారణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రాంతాల వారీగా ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.
  • ఈ కమిటీలు నిరంత‌రం స‌మీక్ష‌లు నిర్వహిస్తూ స‌మ‌న్వ‌యంతో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read this also…Digital Tax on Online Advertisements Removed – Effective from April 1

ఇది కూడా చదవండి..ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు..ఏప్రిల్ 1 నుంచి అమలు..

Read this also…Reasons Behind Rupee Depreciation

అగ్ని ప్రమాద నివారణపై కేంద్రీకరణ

  • న‌గ‌రంలో ఎక్కువ‌గా అగ్ని ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల‌ను గుర్తించి, వాటి వెనుక ఉన్న కారణాల‌ను విశ్లేషించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.
  • ఈ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, నిబంధనల అమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని క‌మిష‌న‌ర్లు ఆదేశించారు.
  • రెగ్యుల‌ర్ తనిఖీల ద్వారా నిబంధనలు పాటిస్తున్నారా లేదా? అన్న విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు.

వరద ముప్పును తగ్గించే చర్యలు

  • వరద ముప్పుకు గురయ్యే 141 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు, అక్కడ పరిస్థితిని సమీక్షించారు.
  • అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కల్వర్టులు, డ్రైనేజీలు, క్యాచ్‌మెంట్ ఏరియాల్లో నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు.
  • క్యాచ్‌మెంట్ ప్రాంతాలను గుర్తించి, వరద నీరు సమీపంలోని చెరువులకు వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
  • జోన్ స్థాయి కమిటీల ద్వారా సమస్యకు ప్రత్యక్ష పరిష్కారం అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Read this also…Narayana Educational Institutions Expands Reach with 52 New Campuses Across India

Read this also…Reliance Jewels Unveils Exclusive Festive Offers for Ugadi & Gudi Padwa

పట్టణ వృద్ధిపై సమన్వయ చర్యలు

  • సమస్యలపై పూర్తి అవగాహన ఉంటేనే, తగిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందని క‌మిష‌న‌ర్లు స్పష్టం చేశారు.
  • జవాబుదారీతన వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా వరద ముప్పు, అగ్ని ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.