365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 23 జూన్, 2023: ప్రపంచంలోనే రుచికరమైన బక్లావాను అందించే బక్లావా తయారీ పరిశ్రమలో భారతదేశపు మొట్టమొదటి ఫుడ్ సేఫ్టీ సిస్టమ్ సర్టిఫికేషన్ (ఎఫ్‌ఎస్‌ఎస్‌సి) 22000ను గౌర్మెట్ బక్లావా పొందింది.
ఈ ప్రతిష్టాత్మకమైన సర్టిఫికేషన్ తన వినియోగదారుల కోసం అధిక-నాణ్యత, సురక్షితమైన ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో తిరుగులేని శక్తిగా పేరుగాంచింది.
గౌర్మెట్ బక్లావా భారతీయ ఆహార పరిశ్రమలో పేరుగాంచిన ఆహార సంస్థగా స్థిరపడింది. నాణ్యతపై దృష్టి సారించిన బక్లావా హైదరాబాద్‌లో మూడు శాఖలను నిర్వహిస్తోంది. బంజారాహిల్స్, కొండాపూర్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ముంబైలో అదనపు శాఖను నిర్వహిస్తోంది.
గౌర్మెట్ బక్లావాలో టర్కీకి చెందిన నిపుణులైన చెఫ్‌లను కలిగి ఉన్నారు. వినియోగదారులను అభిరుచులకు ప్రామాణికమైన రుచిని అందిస్తారు. గౌర్మెట్ బక్లావా విజయంలో నాణ్యత ప్రధానమైనది.
వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అధిక-నాణ్యత గల డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు, డ్రై నట్స్‌తో సహా అత్యుత్తమ పదార్థాలను మాత్రమే వీరు వాడుతారు.హైదరాబాద్ ఆహార ప్రియులకు ఇష్టమైన రుచిని అందిస్తున్నారు.
గౌర్మెట్ బక్లావా వ్యవస్థాపకుడు ఇమాల్ ఇంతియాజ్ సిద్ధిఖీ బంజారాహిల్స్‌లోని గౌర్మెట్ బక్లావా స్టోర్‌లో మీడియాతో మాట్లాడుతూ “భారతదేశంలో బక్లావా తయారీలో మొదటి ఎఫ్‌ఎస్‌ఎస్‌సి 22000 సర్టిఫికేషన్‌ను అందుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము.
ఈ గుర్తింపు మా వినియోగదారులకు అత్యంత నాణ్యమైన ,సురక్షితమైన బక్లావాను అందించడంలో మా అచంచలమైన అంకితభావానికి నిదర్శనంగా భావిస్తున్నాం. హైదరాబాద్ ఆహార ప్రేమికులకు మేము మరింత నాణ్యమైన ఫుడ్‌ను అందిస్తామని అన్నారు.