Sat. Sep 14th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గురుగ్రామ్,ఆగస్టు14 2024: సామ్‌సంగ్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ సీఎస్ఆర్ కార్యక్రమం ప్రోగ్రామ్ ‘సాల్వ్ ఫర్ టుమారో’ 2024 కోసం టాప్ 20 టీమ్‌ల జాతీయ షార్ట్‌లిస్ట్‌ను ఈరోజు ప్రకటించింది. తదుపరి జాతీయ రౌండ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఈ జట్లు గొప్ప భౌగోళిక వైవిధ్యాన్ని సూచిస్తాయి.

భారతదేశం అంతటా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వీరిలో ఉన్నారు. వీరిలో కొందరు మణిపూర్‌లోని ఇంఫాల్, మేఘా లయలోని తూర్పు ఖాసీ హిల్స్, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ వంటి కొన్ని మారుమూల ప్రాంతాలకు చెందిన వారు.

ఈ కార్యక్రమం 3వ ఎడిషన్‌లో, విద్యార్థులు తమ ఆలోచనలను ‘కమ్యూనిటీ,ఇన్‌క్లూజన్’ ,’పర్యావరణం , సుస్థిరత’ అనే రెండు అంశాల క్రింద సమర్పించారు.

స్కూల్ ట్రాక్‌లోని దాదాపు 20% ఆలో చనలు విద్య, వెనుకబడిన సమూహాలకు వనరులకు యాక్సెస్, అనుభవపూర్వక అభ్యాసం, డిజిటల్ అక్షరాస్యత చుట్టూ ఉన్న సవాళ్లకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించాయి.

యూత్ ట్రాక్‌లోని దాదాపు 25% ఆలోచనలు నీటి సంరక్షణ, ఆర్సెనిక్ కాలుష్యం, నీటి వృధా, నదీ పరీవాహక ప్రాంతాల చుట్టూ ఉన్న పర్యావరణ అసమతుల్యత సమస్యల చుట్టూ తిరిగాయి.

అంతేగాకుండా దాదాపు 40% ఆలోచనలు ట్రాఫిక్, వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు లేకపోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల పెరుగుదల ,కార్చిచ్చుల వల్ల ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడంపై దృష్టి సారించాయి.

” సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ సీఎస్ఆర్ కార్యక్రమం అయిన ‘సాల్వ్ ఫర్ టుమారో,’ ఈ సంవత్సరం సాంకేతికతను ఉప యోగించి వాస్తవ-ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థులకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించింది.

ఈ సంవత్సరం మేం దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం పై దృష్టి సారించాం. విభిన్న భౌగోళిక ప్రాంతాల నుంచి వస్తున్న ప్రాతినిధ్యంపై మేం సంతోషిస్తున్నాం.

మా కార్యాలయాలు, ఆర్‌అండ్‌డి సెంటర్లలో ఇన్నోవేషన్ వాక్‌లు, చివరగా ఐఐటి ఢిల్లీలో జరిగే జాతీయ పిచ్ ఈవెంట్ కోసం ముందుకు సాగుతున్న జట్లకు మేం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ”అని సామ్‌సంగ్ సౌత్ వెస్ట్ ఏషియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్పీ చున్ అన్నారు.

“వారి ఆలోచనలు ఎలా రూపుదిద్దుకుంటాయో ,స్థూల-స్థాయి సామాజిక సమస్యలను పరిష్కరించడా నికి ఎలా దోహదపడతాయో చూడాలని మేము ఆసక్తిగా ఉన్నాం” అని అన్నారాయన.

“‘సామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో’ తో మా భాగస్వామ్యాన్ని కొనసాగించడం మాకు గర్వకారణం. ఈ సంవత్సరం ప్రోగ్రామ్ నిర్మాణం ప్రాంతీయ ప్రతిభను పొందడంపై దృష్టి సారించింది. ఇది షార్ట్‌లిస్ట్ చేయబడిన జట్ల ఆలోచనలలో ప్రతిబింబిస్తుంది. కొన్ని ఆలోచనలు నిజంగా స్ఫూర్తిదాయకంగా, ఆశాజనకంగా ఉన్నాయి.

దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను పెంచే స్థానిక ప్రతిభా వంతుల ప్రయాణాన్ని చూసేందుకు మేం సంతోషిస్తున్నాం” అని ఐఐటీ (దిల్లీ) ఎఫ్ఐటీటీ ఎండీ ప్రొఫెసర్ ప్రీతి రంజన్ పాండా అన్నారు.

ఈ జాతీయ 20 జట్లకు సామ్‌సంగ్ ఇండియా కార్యాలయాలు, సంస్థ R&D కేంద్రాలు, డిజైన్ సెంటర్‌లో ఇన్నోవేషన్ వాక్‌కి హాజరయ్యే విశిష్ట అవకాశం లభిస్తుంది. వారు తమ ఇన్నోవేషన్ వాక్ ను పూర్తి చేసిన తర్వాత, ఈ 20 జట్లు జాతీయ పిచ్ ఈవెంట్‌లో పాల్గొంటాయి. అక్కడ అవి తమ ట్రాక్‌లలో పోటీ పడతాయి. సామ్‌సంగ్ నిపుణులు & ఉన్నతోద్యోగులతో కూడిన జాతీయ జ్యూరీకి పంపించబడుతాయి.

సెమీ-ఫైనలిస్టులు ఏమి పొందుతారు:

స్కూల్ ట్రాక్: సెమీ-ఫైనలిస్టులు 10 జట్లు ప్రోటోటైప్ డెవలప్‌మెంట్ & సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్స్ కోసం రూ. 20000 గ్రాంట్‌ను పొందుతాయి. ఫైనల్‌కు చేరిన 5 బృందాలు ప్రోటోటైప్ మెరుగుదల & సామ్‌సంగ్ గెలాక్సీ వాచీల కోసం ఒక్కొక్కటి రూ. 1 లక్ష గ్రాంట్‌ను పొందుతాయి

యూత్ ట్రాక్: సెమీ-ఫైనలిస్టులు 10 జట్లు ప్రోటోటైప్ డెవలప్‌మెంట్ & సామ్‌సంగ్ గెలాక్సీ ల్యాప్‌టాప్‌ల కోసం రూ. 20000 గ్రాంట్‌ను పొందుతాయి. ఫైనలిస్టులు 5 జట్లు ప్రోటోటైప్ మెరుగుదల & సామ్‌సంగ్ Z ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఒక్కొక్కటి INR 1 లక్ష గ్రాంట్‌ను పొందుతాయి.

విజేతలు ఏమి పొందుతారు:

స్కూల్ ట్రాక్: విజేత జట్టు సాల్వ్ ఫర్ టుమారో 2024 “కమ్యూనిటీ ఛాంపియన్”గా ప్రకటించబడుతుంది. ప్రోటోటైప్ అడ్వా న్స్‌మెంట్ కోసం రూ. 25 లక్షల సీడ్ గ్రాంట్‌ను అందుకుంటుంది. విజేత జట్ట పాఠశాలలు విద్యాపరమైన సేవలను పెంచడా నికి, సమస్య పరిష్కార ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించడానికి వీలుగా సామ్‌సంగ్ ఉత్పత్తులను అందుకుంటాయి.

యూత్ ట్రాక్: విజేత జట్టు సాల్వ్ ఫర్ టుమారో 2024 కోసం “ఎన్విరాన్‌మెంట్ ఛాంపియన్”గా ప్రకటించబడుతుంది. ఐఐటీ (దిల్లీ)లో ఇంక్యుబేషన్ కోసంరూ. 50 లక్షల గ్రాంట్‌ను అందుకుంటుంది. గెలుపొందిన జట్ల కళాశాలలు తమ విద్యాపరమైన సేవలను పెంచడానికి, సామాజిక వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి సామ్‌సంగ్ ఉత్పత్తులను కూడా అందుకుంటాయి.

అమెరికాలో మొదటిసారిగా 2010లో ప్రారంభించిన సాల్వ్ ఫర్ టుమారో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలలో పని చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2.3 మిలియన్ల మంది యువకులు ఇందులో పాల్గొన్నారు.

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఎస్ఆర్ విజన్ ‘టుగెదర్ ఫర్ టుమారో! ఎనేబుల్ పీపుల్’ రేపటి నాయకులను శక్తివంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకులకు విద్యను అందించడానికి కట్టుబడి ఉంది. మా CSR వెబ్‌పేజీలో సామ్‌సంగ్ Electronics CSR ప్రయత్నాలపై మరిన్ని కథనాలను చదవండి http://csr.samsung.com

error: Content is protected !!