365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబరు 31,2024: శేరిలింగంపల్లి మండలంలో మంగళవారం హైడ్రా అధికారులు చెరువుల ఆక్రమణలను కూల్చివేత చేశారు.ఖాజాగూడ,నానక్ రామ్ గూడ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భగీరథమ్మ ,తౌతానికుంట చెరువుల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు.
స్థానికుల ఫిర్యాదుల మేరకు గత వారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ ,బఫర్ జోన్లలో అక్రమ ఆక్రమణలు జరిగినట్టు గుర్తించారు.
కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం 10 ఆక్రమణలను కూల్చివేత చేశారు.రేకుల షెడ్డలు,రేకులప్రహరీలు నిర్మించి అక్రమంగా ఆక్రమించారని అధికారులు పేర్కొన్నారు.
నోటీసులు అందజేసిన తర్వాత కూల్చివేతలు ప్రారంభించామని తెలిపారు.ఈ చర్యతో 10 ఎకరాల మేర ప్రభుత్వ భూములు,చెరువు భూములు స్వాధీనం చేసుకున్నారు.