365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైద‌రాబాద్‌, నవంబర్ 13,2024: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను బుధవారం సందర్శించిన హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కుంట పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్బంగా, స్థానిక వీకర్ సెక్షన్ కాలనీ వాసులు, అక్కడి ప్రజలు ఆయనను కలసి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు, బతుకమ్మ కుంట వద్ద ఎటువంటి ఇళ్లను కూల్చడం లేదని హైడ్రా కమిషనర్‌ హామీ ఇచ్చారు.

బతుకమ్మ కుంట పునరుద్ధరణతో పాటు, చెరువు పక్కన ఉన్న ఇళ్లకు ఎటువంటి ముప్పు లేకుండా, ప్రాంతాన్ని శుభ్రపరిచి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని కమిషనర్‌ తెలిపారు.

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించిన ప్రకారం, బతుకమ్మ కుంట పునరుద్ధరణ కోసం 5.15 ఎకరాల విస్తీర్ణం లోనే పనులు చేపడుతామని, దీనికి సంబంధించిన అధికారిక సర్వే ప్రకారం, మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బతుకమ్మ కుంటను, బఫర్ జోన్‌తో కలిపి 16.13 ఎకరాల విస్తీర్ణంలో పునరుద్ధరించనుంది.

ఇదే విధంగా, పునరుద్ధరణ పనులపై ఎలాంటి అవరోధాలు లేకుండా స్థానికులు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

హైడ్రా కమిషనర్‌ మాట్లాడుతూ, బతుకమ్మ కుంటలో నీరు ఉండేలా చేస్తే, దానికి చుట్టూ పర్యావరణాన్ని, భూగర్భ జలాలను పెంచే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు.

ఈ చర్యలు స్థానికులకు హర్షం కలిగించాయి, వారు దాంతో పాటు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని కోరారు.