365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 8,2025: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం Thurkayamjal చెరువును సందర్శించారు.చెరువు తూములు మూసివేయడం, అలుగు పెంచడం వల్ల చెరువు పైభాగంలోని పంటపొలాలు,యిల్లు నీట మునుగుతున్నాయని స్థానికులు 6వ తేదీన హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో చేసిన ఫిర్యాదులపై కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.

Thurkayamjal చెరువు FTL పైన వచ్చిన ఫిర్యాదులపై పరిశీలన జరిపాం.ఇరిగేషన్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో చర్చలు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటాం. అలాగే, ఐఐటీ, బిట్స్ పిలాని, JNTU విద్యాలయాల ఇంజనీరింగ్ నిపుణులతో కూడా ఈ అంశంపై అధ్యయనం జరిపిస్తాం.

NRSC ఇమేజీలు, గ్రామాలకు సంబంధించిన మ్యాప్స్ ద్వారా పరిశీలించి, రెండు మూడు నెలల్లో శాస్త్రీయ పద్ధతుల్లో చెరువు FTLను నిర్ధారిస్తాం.నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.నగరంలో కొన్ని చెరువులు మాయం కాగా, మరికొన్ని చెరువులు FTL పరిధి పెరుగుతున్నట్టు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలిస్తాం.

చెరువులోకి మురుగు నీరు చేరుకుంటోంది, ఆ నీరు కిందకు పోవడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.తాము యింటి స్థలాలు కొన్నప్పుడు ఆ స్థలంలో నీరు నిలవలేదని, Thurkayamjal చెరువు పైభాగంలో ఆదిత్య నగర్ నివాసితులు ఫిర్యాదు చేశారు.

చెరువు FTL గురించి అన్ని వివరాలు సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన హైడ్రా కమిషనర్ శ్రీనావ్ రంగనాథ్ .ఇక్కడ వున్న నివాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ తెలిపారు.

గ్రామానికి చెందిన మ్యాప్స్, రెవెన్యూ రికార్డులు, NRSC ఇమేజీల ఆధారంగా పరిశీలించి, అన్ని శాఖల అధికారులతో కలిసి త్వరలో చెరువు FTLని నిర్ధారిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.”పేదలను హైడ్రా యిబ్బంది పెట్టాడు.

హైడ్రా పేరు చెప్పి మిమ్మలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తే నమ్మవద్దు” అని కమిషనర్ అన్నారు.Thurkayamjal చెరువు విస్తరణ 495 ఎకరాల్లో వుందని, మొత్తం విస్తీర్ణం 522 ఏకరాలనే అంచనా వేసి, అన్ని లెక్కలను పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.

కమిషనర్ ఏవీ రంగనాథ్ ని స్థానిక నివాసితులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.