365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 17,2024: మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మండలంలోని మూసాపేట, ఖైతలాపూర్ పరిధిలోని కాముని చెరువుతో పాటు మైసమ్మ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.
కాముని చెరువులో నిర్మాణ వ్యర్థాలు,మట్టితో కొంతమంది ఆక్రమిస్తున్నారని, అలాగే చెరువులకు అనుసంధానమైన కాలువలపై ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలో, కమిషనర్ మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.
కాముని చెరువులో మట్టిపోసినవారిని వదిలిపెట్టేది లేదని, చెరువులో ఎటువంటి నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చి వేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.
చెరువుల కాబ్జాపై స్థానికులు సంఘటితమై ఫిర్యాదు చేయడమే కాకుండా, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తామని చెప్పడం చాలా శుభ పరిణామమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అన్నారు.
హైడ్రా 2024 జూలైలో ఆవిర్భవించిందని, ఆ సమయంలో నివాసముండే ప్రాంతాలకు హైడ్రా సంబంధం లేకపోతుందని కమిషనర్ తెలిపారు. అయితే ఈ నిబంధనలు వాణిజ్య సముదాయాలకు వర్తించవని స్పష్టం చేశారు.
సంబంధిత ప్రభుత్వ విభాగాల అనుమతులతో నిర్మాణాలు ఉన్న ప్రాంతాలను హైడ్రా సంభవించదు అని కూడా కమిషనర్ చెప్పారు.హైడ్రా ఆవిర్భవించిన తర్వాత ఆక్రమ నిర్మాణాలను తొలగిస్తామని కమిషనర్ చెప్పారు.
కాముని చెరువు, మైసమ్మ చెరువు పరిసరాల్లో నివసించే ప్రజలు చెరువులను కబ్జా కాకుండా చూసేందుకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం మైసమ్మ చెరువు పరిసరాలను కూడా కమిషనర్ పరిశీలించారు.
కాముని చెరువులో నుంచి మైసమ్మ చెరువుకు వచ్చే వరద కాలువ పనులు పూర్తి చేయకుండా అక్కడ వాసవి నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపడతానన్న విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
17 మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు ప్రతిపాదించిన వరద కాలువను వెంటనే పూర్తి స్థాయిలో నిర్మించాలని కమిషనర్ నిర్మాణ సంస్థకు సూచించారు.
వరద కాలువ మార్పు వల్ల సఫ్దార్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ బస్తీలలో వర్షాకాలంలో మునిగిపోవడం జరిగిందని స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
వచ్చే వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు ఎదురుకావడం కాకుండా, కాముని చెరువు ,మైసమ్మ చెరువు మధ్య ఉన్న వరద కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ స్థానిక అధికారులను ఆదేశించారు.