365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,ఫిబ్రవరి 7,2025: అమీన్ పూర్ మున్సిపాలిటీలోని పలు లేఔట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ఐలాపురం, చక్రపురి కాలనీల్లో పర్యటించిన ఆయన, బాధితులను కలుసుకుని వారి సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు.

ఈ సందర్భంగా లేఔట్ల సమస్యలపై సమావేశాలు నిర్వహించి ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. 1980లలో కొనుగోలు చేసిన తమ ఇంటి స్థలాలను ముఖీం అనే వ్యక్తి కబ్జా చేశాడని ఐలాపురం గ్రామస్థులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

ఈ లేఔట్లపై కోర్టు కేసులు ఉన్నందున, కోర్టు ఉత్తర్వులను సమీక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.

అసలైన లబ్ధిదారులెవరనే అంశాన్ని తేలుస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుందని తెలిపారు.

This Also Read:New Study: This Superfruit May Lower the Risk of at Least 6 Cancers

ఇది కూడా చదవండి:భారతదేశంలో ఫ్రీగా వైద్య సలహాలు, చికిత్సలు అందించే టాప్ టెన్ హాస్పిటల్స్..

భూసర్వే మరింత పారదర్శకంగా ఉండేందుకు సర్వే ఆఫ్ ఇండియా, ఎడీ సర్వే, హైడ్రా సర్వే బృందం సంయుక్తంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను కాపాడేందుకు హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశామని, కబ్జాదారులపై ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.