365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 28,2025:నగరంలోని చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. హైడ్రా చేపట్టిన మొదటి విడత పనుల్లో భాగంగా, సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్ల చెరువు, భుమ్రుఖ్ ఉద్దీన్ దౌలా చెరువులను కమిషనర్ సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు.
Read this also…Strand Life Sciences Unveils StrandOmics for Rare Disease Diagnosis
Read this also…Reliance Foundation Announces Postgraduate Scholarships 2024-25 Results on National Science Day
ఇది కూడా చదవండి...జీవనశైలి రుగ్మతలకు రెండు కారణాలు ఉన్నాయి..? అవేంటంటే..?
చెరువుల పునరుద్ధరణపై కమిషనర్ ఆదేశాలు
.స్థానికులతో మాట్లాడి చెరువుల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
.రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
.హైడ్రా ఈ బాధ్యతను ప్రభుత్వ సూచనల మేరకు చేపట్టిందని, సంబంధిత శాఖల భాగస్వామ్యంతో పనులు వేగవంతంగా సాగిస్తున్నామని వివరించారు.
.స్థానికుల సహకారం మంచి ప్రోత్సాహాన్నిచ్చిందని, త్వరలోనే చెరువుల్లో జీవకళ నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చెరువుల బఫర్ జోన్లలో నివాస భద్రత
.బఫర్ జోన్లలో భూములు కోల్పోయిన వారికి టీడీఆర్ పథకం కింద ప్రభుత్వం సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు.
.ఇప్పటికే ఉన్న నివాసాలను కూల్చే ఉద్దేశం లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
.చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ పనుల్లో ఎవరినీ బలవంతంగా తొలగించబోమని హామీ ఇచ్చారు.
Read this also…Join the Green Movement: Mindspace Eco Run on March 2nd
హైడ్రా చేపట్టిన అభివృద్ధి పనులు
. మొత్తం రూ. 58.50 కోట్ల వ్యయంతో చెరువుల అభివృద్ధి చేపడుతున్నారు.
.ప్రస్తుతానికి చెరువుల డీ వాటరింగ్ పనులు జరుగుతున్నాయి – చెరువుల లోపల నిల్వ ఉన్న వ్యర్థ జలాలను తొలగించి, వాటిని పూర్తిగా డ్రై చేస్తున్నారు.
.వివిధ దశల్లో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను కమిషనర్ పరిశీలించి, తగిన మార్గదర్శకాలు అందించారు.
.2025 జూన్ నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
హైడ్రా పర్యవేక్షణలో చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతుండగా, నగరంలోని నీటి వనరుల సంరక్షణకు ఇది కీలక అడుగని అధికారులు పేర్కొన్నారు.