365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 14,2025: ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి విస్తృతంగా విచారణ చేపట్టారు. ఉదయం నుంచి రాత్రివరకు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పలు చోట్ల పర్యటించిన ఆయన, కొన్ని ఫిర్యాదులకు అక్కడికక్కడే పరిష్కారాన్ని చూపగా, మరికొన్నింటిపై సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. తగిన పత్రాలు పరిశీలించి తప్పులెవరైనా చేసినా చర్యలు తప్పవని బాధితులకు భరోసా ఇచ్చారు.

కోహెడలో ఆక్రమణలపై చర్యలు
అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కోహెడ గ్రామంలో ‘రాజాజీ నగర్’ పేరిట వేసిన లేఅవుట్‌లో 17 ఎకరాల్లో 190 ప్లాట్లు ఉన్నాయి. ఈ లేఅవుట్‌లో పార్కులు, రహదారులు కలిపేసి అక్రమంగా కబ్జా చేశారని ప్లాట్ యజమానులు ఫిర్యాదుచేయగా, గతంలో హైడ్రా చర్యలు తీసుకుంది.

ఇది కూడా చదవండి…బహుళ బంగారు పతకాలతో ఆసియా పవర్‌లిఫ్టింగ్‌లో రాణించిన కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులు..

Read This also…Muthoot Finance Reports Record Performance in FY25..

అయితే, మరోసారి సమ్మిరెడ్డి బాలరెడ్డి నిర్మాణాలు ప్రారంభించడంతో యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ స్వయంగా వచ్చి పరిసరాలను పరిశీలించారు.

రాజాజీ లేఅవుట్‌లో రహదారులు, పార్కులపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తామని, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చెరువులో మునిగిన భూములపై సమీక్ష
అనంతరం కోహెడ గ్రామంలోని కొత్త చెరువును సందర్శించారు. స్థానికులు తమ భూములు చెరువులో మునిగిపోయాయని ఫిర్యాదు చేయడంతో కమిషనర్ పరిశీలించారు.

డాలర్ హిల్స్‌లో నిర్మాణాలపై ఆగ్రహం
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీని సందర్శించిన కమిషనర్, అక్కడ పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారన్న ఫిర్యాదును పరిశీలించారు. అనుమతులు లేకుండానే ఎటువంటి నిర్మాణాలు చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. కాలనీకి వెళ్లే మార్గంలో 8 అంతస్తుల భవనం సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మిస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు.

Read This also… Danone India Launches DEXOGROW: A Nutrient-Rich Milk Drink for Toddlers..

Read This also… Reliance Nippon Life Reports 25% Profit Growth in FY25..

బేగంపేట–కూకట్‌పల్లి పర్యటన
గుట్టలబేగంపేటలో రహదారి మీద నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని, అనంతరం కూకట్‌పల్లి డైమండ్ హిల్స్ లేఅవుట్‌ను పరిశీలించారు. కోర్టు తీర్పు ఉన్నప్పటికీ ఫలితం లేదని వాపోయిన ప్లాట్ యజమానులకు, ఇరు పక్షాల కాగితాలు పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

బౌరంపేటలో లేఅవుట్ సమస్య
దుండిగల్ మండలం బౌరంపేటలోని జీపీఆర్ లేఅవుట్‌లో 20 ఎకరాల భూమిలో 200 ప్లాట్లు ఉన్నాయని, రోడ్లు వేయనివ్వడం లేదని యజమానులు ఫిర్యాదుచేశారు. కమిషనర్ రంగనాథ్ సర్వే నం. 345 పరిధిలో ఆ ప్రాంతాన్ని పరిశీలించి, రోడ్లు, పార్కుల స్థలాలు గుర్తించమని అధికారులకు సూచించారు.