365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 20,2025: శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లోని గంగారం చెరువును హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గురువారం ఉదయం పరిశీలించారు. చెరువులో మట్టిని నింపుతున్న ఘటనలపై స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.
ఇది కూడా చదవండి…సినిమాల్లో అసభ్య డాన్స్ స్టెప్స్‌పై మహిళా కమిషన్ సీరియస్ హెచ్చరిక
ఇది కూడా చదవండి…టాటా ప్లే-ఫ్యాన్‌కోడ్ భాగస్వామ్యంతో క్రీడాభిమానులకు అదిరే అనుభవం
ఈ సందర్భంగా కమిషనర్ ఏవి రంగనాథ్ చెరువులో డంపింగ్ జరుగుతున్న విషయంపై స్థానిక ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. డంపింగ్‌కు బాధ్యులైనవారి వివరాలు కోరారు. 2023 డిసెంబరులో డంపింగ్‌పై ఇరిగేషన్ శాఖ అధికారులు కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

తాజాగా హైడ్రా డీఆర్‌ఎఫ్ లేక్ ప్రొటెక్షన్ గార్డులు కూడా చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, త్వరలోనే ఇది ప్రారంభమవుతుందని కమిషనర్ వెల్లడించారు. చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలను అరికట్టడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ కీలక పాత్ర పోషించనుందని స్పష్టం చేశారు.
Read this also…Tata Play and FanCode Launch ‘Tata Play FanCode Sports’ to Bring 24/7 Live Sports Action to Indian Fans
ఇది కూడా చదవండి…సునీతా విలియమ్స్ ప్రయాణం ఎలా జరిగిందో తెలుసా..?
చెరువుల వద్ద 24 గంటలూ హైడ్రా లేక్ ప్రొటెక్షన్ గార్డులు మోహరించి ఉంటారని, డంపింగ్ జరుగకుండా నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప సొసైటీ సమీపంలోని సున్నం చెరువును కూడా పరిశీలించిన కమిషనర్, అక్కడి పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు.
రాబోయే వర్షాకాలానికి చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.