365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైద‌రాబాద్‌, డిసెంబ‌రు 6,2024: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లోని యాప్రాల్‌లో హైడ్రా కూల్చివేతలు. నాగిరెడ్డి కుంట నాలాకు ఆనుకుని బ‌ఫ‌ర్ జోన్లో నిర్మాణాలు.ఫిర్యాదుల‌పై రెవెన్యూ, ఇరిగేష‌న్‌, హెచ్ ఎండీఏ, మున్సిపాలిటీ విభాగాధికారుల విచార‌ణ‌.

స‌ర్వే నంబ‌రు 14, 32 లోని ప్ర‌భుత్వ భూమిలోకి జ‌రిగి డీఎన్ ఆర్ ఫంక్ష‌న్ హాల్ నిర్మాణం. ప్రైవేటు స్థ‌లానికి చెందిన స‌ర్వే నంబ‌రులో నిర్మించిన‌ట్టు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి status quo ఆర్డర్ తెచ్చుకున్న నిర్మాణ‌దారుడు. ఆ ప‌క్క‌నే ప్ర‌భుత్వ భూమి స‌ర్వే నంబ‌రు 14, 32లోకి చొర‌బ‌డి ఫంక్ష‌న్ హాల్‌ను నిర్మించిన య‌జ‌మాని.

ఫంక్ష‌న్ హాల్ మొత్తం భాగం stay ఉన్నది అని అధికారులను తప్పు దారి పట్టించి నిర్మాణ‌దారుడు. హైడ్రా విచార‌ణ‌లో ప్ర‌భుత్వ భూమిలోకి వ‌చ్చిన‌ట్టు నిర్ధార‌ణ‌.హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారి ఆదేశాల మేర‌కు .. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 14,32 ప‌రిధిలోకి వ‌చ్చిన ఫంక్షన్ హాల్ లోని కొంత భాగాన్ని, కాంపౌండ్ వాల్ ను కూల్చేసిన హైడ్రా అధికారులు.

నాగిరెడ్డి కుంట నాలా బ‌ఫ‌ర్ జోన్‌లో నిర్మించినందుకు కూల్చివేతలు జరిపామన్న అధికారులు.GHMC యాక్ట్ 405 ప్రకారం నాగిరెడ్డి కుంట నాలాకు అనుకుని వున్న భూమిలో నిర్మించిన వాటిని కూల్చివేసినట్టు పేర్కొన్న అధికారులు.

కోర్టు స్టే ఆర్డ‌ర్‌ వున్న సర్వే నంబర్ 25లో కూల్చివేతలు చేపట్టలేదని స్పష్టం చేసిన అధికారులు.ఆ పరిసరాల్లో మ‌రో చోట సర్వే నంబర్ 32 లో దోభీ ఘాట్ ను క‌బ్జా చేసే ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకున్న హైడ్రా.

దోభీఘాట్‌ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కాంపౌండ్ వాల్ ను కూడా కూల్చేసిన హైడ్రా. నాగిరెడ్డి కుంట నాలాతో పాటు దోభీఘాట్ ఆక్ర‌మ‌ణ‌ల‌పై యాప్రాల్‌లోని ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ పోరాటం.ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ప్ర‌తినిధుల‌పై ప‌లు ర‌కాల కేసులు పెట్టిన ఆక్ర‌మ‌ణ‌దారులు.

ఏడెనిమిదేళ్లుగా తాము చేసిన పోరాటం.. హైడ్రాతో ఫ‌లించింద‌ని ఆనందం వ్య‌క్తం చేసిన ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ప్ర‌తినిధులు.హైడ్రా చ‌ర్య‌ల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేసిన స్థానికులు, యాప్రాల్‌లోని ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ప్ర‌తినిధులు.