365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 10,2025: మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ పెద్ద చెరువులో నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL), బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించిన హైడ్రా.
ఈ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతులు రద్దు చేసినా, నిర్మాణాలు కొనసాగుతున్నందున హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గురువారం క్షేత్రస్థాయిలో చెరువు పరిసరాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్.
అధికారుల వివరణ: ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులు గతంలో కొన్ని నిర్మాణాలను FTL పరిధిలో ఉన్నాయని పేర్కొంటూ కూల్చివేశారు అని స్పష్టం చేశారు.
కానీ, నోటీసులు పట్టించుకోకుండా కొత్తగా మరిన్ని విల్లాలు నిర్మాణం చేపట్టడం హైడ్రా అధికారులను ఆగ్రహానికి గురి చేసింది.
హైడ్రా కమిషనర్ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కూల్చివేతలు ప్రారంభం: శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు.
మొత్తం 13 విల్లాలు ఈ కూల్చివేత జాబితాలో ఉన్నాయి.
ఒక్కొక్క విల్లా సుమారు 400 గజాల విస్తీర్ణంలో One Plus Two స్టైల్‌లో నిర్మించినట్లు సమాచారం.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో: ఈ కూల్చివేతల్లో రెండు విల్లాలకు సంబంధించి కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నందున, కోర్టును సమాచారంలోకి తీసుకొని హైడ్రా తదుపరి చర్యలు చేపట్టనుంది.