365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 25,2025:రంగారెడ్డి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో శనివారం హైడ్రా కూల్చివేతల కార్యక్రమం నిర్వహించారు. దివ్యనగర్ లేఔట్ చుట్టూ నిర్మించిన ప్రహరీలు తొలగించారు, ఇవి పలు కాలనీలు, నివాస ప్రాంతాలకు వెళ్లే మార్గాలను ఆవరించాయి.
ఈ చర్యతో దివ్యనగర్ లేఔట్ ప్లాట్ల యజమానులు ఊరట చెందారు. ప్రహరీ తొలగింపు కారణంగా సమీప కాలనీలైన ఏకశిలా లేఔట్, వెంకటాద్రి టౌన్‌షిప్, సుప్రభాత్ వెంచర్-1, మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్-4, వీజీహెచ్ కాలనీ, సుప్రభాత్ వెంచర్-2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడ రోడ్లకు ప్రవేశం సులభమైంది.

దివ్యనగర్ లేఔట్ మొత్తం 200 ఎకరాల్లో విస్తరించి ఉండగా, 2218 ప్లాట్లను ఆ లేఔట్‌లో పంపిణీ చేశారు. అయితే వీటిలో 30 శాతం ప్లాట్లు నల్లమల్లారెడ్డి వేనంటూ స్థానికులు ఆరోపణలు చేస్తున్న విషయం గమనార్హం.
ఈ కూల్చివేత చర్యలతో స్థానిక నివాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించినందుకు మున్సిపాలిటీకి కృతజ్ఞతలు తెలిపారు.