365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 27,2025: ప్రభుత్వ భూముల కబ్జాలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) యంత్రాంగం చురుగ్గా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు.

ఇది కూడా చదవండి...ఉగాది శోభను వజ్రాల తళుకులతో మరింత అందంగా మలిచిన ఓరా!

Read this also…ORRA Ushers in Ugadi with Tradition and Timeless Diamond Elegance

మాధాపూర్‌లోని గుట్టల బేగంపేట, ఫిలింనగర్ బస్తీ సమీపంలోని విష్పర్ వ్యాలీ చెరువు, శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామంలోని ప్రభుత్వ భూములను ఆయన సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల సంరక్షణకు హైడ్రా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “రహదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం.

ఇది కూడా చదవండి...గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ లుక్ విడుదల – మాస్ అండ్ ఇంటెన్స్ లుక్ అదుర్స్!

Read this also…PEDDI: Ram Charan’s Pan-India Spectacle Unveiled with a Stunning First Look

అలాగే, ప్రహరీ గోడలు నిర్మించి కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం” అని రంగనాథ్ తెలిపారు. కబ్జాలను అరికట్టి, ప్రభుత్వ ఆస్తులను సురక్షితంగా ఉంచేందుకు హైడ్రా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు.