365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 6,2025: శనివారం నగరంలో నిర్వహించిన గణపతి నిమజ్జనోత్సవంలో హైడ్రా కీలక పాత్ర పోషించింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని హుస్సేన్ సాగర్ వద్ద హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షించారు.

ఇది కూడా చదవండి…మహీంద్రా కార్లపై జీఎస్టీ తగ్గింపుతో భారీగా ప్రయోజనం.. నేటి నుంచే వినియోగదారులకు లబ్ధి!

హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా కంట్రోల్ రూమ్ నుంచి నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని సమీపంలోనే పరిశీలించారు. కార్యక్రమంలో హైడ్రా అదనల్ కమిషనర్ ఎన్. అశోక్ కుమార్, అదనపు సంచాలకులు వర్ల పాపయ్య తో పాటు DRF అధికారులు జయప్రకాష్, యజ్ఞ నారాయణ, గౌతం, మోహన్ పాల్గొన్నారు.

హైడ్రా సిబ్బంది హుస్సేన్ సాగరంలో బోటులో తిరుగుతూ పరిసరాలను గస్తీ చేస్తూ, సురక్షిత నిమజ్జన కార్యాచరణను నిశితంగా పర్యవేక్షించారు.