365తెలుగు డాట్ కామ్ ఆన్ న్యూస్,నవంబర్ 9,2024: ఫిల్మ్ నగర్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా. ఫిలింనగర్ రోడ్డు కలిసిన ప్రధాన రహదారి చోట ఆక్రమించి నిర్మించిన కట్టడం పై హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు. ఫిలింనగర్ లేఅవుట్ ను పరిశీలించిన హైడ్రా అధికారులు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారణ.
అదే స్థలానికి అనుకుని వున్న యిల్లు ప్రహరీ కూడా ఆక్రమించి నిర్మించినట్టు నిర్ధారణ. అక్కడ రేకుల షెడ్డుతో పాటు ఆపక్కనే రోడ్డు మీదకు వచ్చిన యింటి ప్రహరీని కూల్చేసిన హైడ్రా. కూల్చివేతలు జరిగిన వెంటనే డెబ్రీస్ ను తొలగించిన హైడ్రా.
Ghmc ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ శ్రీ ఆనురాగ్ జయంతి తో మాట్లాడిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు. వెంటనే రోడ్డు నిర్మించాలని జోనల్ కమిషనర్ కు సూచించిన హైడ్రా కమిషనర్. 2 రోజుల్లో రోడ్డు నిర్మాణం.
15 ఏళ్లుగా అక్కడ నిర్మాణాలు వున్నాయి అని చెప్పిన స్థానికులు. ఆక్రమణల కూల్చివేయడంతో రహదారి విస్తరణ జరిగింది అని హర్షం వ్యక్తం చేసిన స్థానికులు