365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 13,2025: పాతబస్తీలోని యాకుత్‌పురా రైల్వే స్టేషన్ సమీపంలో వరద కాలువలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని హైడ్రా సిబ్బంది బుధవారం కాపాడారు.
సమాచారం అందగానే రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తక్షణ చర్యలను ప్రారంభించారు. కాలువలోకి దిగడానికి స్థలం లేకుండా ఉన్న ప్రమాదకర పరిస్థితుల్లో, యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి నిచ్చెన కింద నుంచి సహాయంగా చర్యలు చేపట్టారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మేకల మేత కోసం చెట్టు కొమ్మలను తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించిన గౌస్ (35) ప్రమాదవశాత్తు వరద కాలువలోకి జారిపోయాడు. ఈ సంఘటనకు సాక్ష్యంగా ఉన్న స్థానికులు, 100 మీటర్ల దూరంలో చెత్త తొలగించే పనిలో ఉన్న హైడ్రా సిబ్బందికి సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి…భారతదేశంలో సిరింజి, క్యాట్రిడ్జ్ గ్లాస్ ట్యూబింగ్‌లతో ప్రాథమిక ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్‌లో కొత్త శిఖరాలను చేరుకున్న SCHOTT..
హైడ్రా ఇన్‌స్పెక్టర్ బాలగోపాల్ తక్షణమే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గౌస్‌ను సురక్షితంగా రక్షించారు. ఈ సాహసానికి రెయిన్ బజార్ కార్పొరేటర్ వసీ, హైడ్రా సిబ్బంది వంశీ, బాలరాజు తదితరులు కూడా సహకరించారు.
ఈ ఘటనలో, హైడ్రా సిబ్బంది తక్షణ చర్య ద్వారా యువకుడి ప్రాణాలను రక్షించడంలో కీర్తి చరిత్ర సృష్టించారు.