Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 8 ,2024:హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కర్ణాటక ట్యాంక్ కన్సర్వేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (KTCDA) అధికారులతో సమావేశమయ్యారు. హైడ్రా అధికారుల బృందం 2014లో వచ్చిన KTCDA చట్టం యొక్క వివరాలను పరిశీలించింది.

KTCDA సీఈఓ రాఘవన్ తో హైడ్రా కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమై, చెరువుల పరిరక్షణలో KTCDA చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేశారు.

రాఘవన్ ప్రకారం, FTLతో పాటు బఫర్ జోన్లలోని భూమిని పూర్తిగా ప్రభుత్వ భూమిగా పరిగణిస్తారు. కర్ణాటకలో బఫర్ జోన్ ను మాగ్జిమం వాటర్ లెవెల్ గా పరిగణిస్తారు.

దిశాంక్ యాప్ ద్వారా కర్ణాటకలో ప్రభుత్వ భూమి,పట్టా భూమి వివరాలు, హక్కుదారుల సమాచారం వంటి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు.

HYDRAA సంస్థ చెరువుల ఆక్రమణల తొలగింపులో KTCDA అనుసరిస్తున్న విధానాలను పరిశీలించింది.

అదనంగా, చెరువుల అభివృద్ధి కోసం DPR (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారు చేయడం, ఆ రిపోర్ట్‌ను టెక్నికల్ టీమ్ ద్వారా సమీక్షించడం, అనంతరం పనులను చేపట్టడం వంటి విధానాలను రాఘవన్ వివరించారు.

error: Content is protected !!