365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైద‌రాబాద్,జనవరి 4,2025: ఇక నుంచి ప్రతి సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో ప్ర‌జావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాల స్వీకరించ నున్నారు హైడ్రా అధికారులు.

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 4, 2025: చెరువులు, నాలాలు, ప్ర‌భుత్వ స్థ‌లాలు, ప్ర‌జావ‌స‌రాల ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేస్తున్న హైడ్రా (HYDRAA) సంస్థ ఇప్పుడు ప్ర‌జ‌ల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీక‌రించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతి సోమవారం (ప్రభుత్వ సెలవులు మినహా) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించింది.

హైడ్రా సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో చేపట్టింది. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల ఫిర్యాదులు, సలహాలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.

📅 ప్రజావాణి కార్యక్రమం వివరాలు:
➡️ ప్రతి సోమవారం
➡️ ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు
➡️ తిరిగి మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు
➡️ ప్రదేశం: రాణిగంజ్‌లోని బుద్ధభవన్

📂 ఫిర్యాదుదారులకు సూచనలు:
ఫిర్యాదుదారులు తమకు సంబంధించి ఉన్న సమస్యల వివరాలు, ఆధార పత్రాలు హైడ్రా కార్యాలయానికి వచ్చి పూర్తి వివరాలతో నివేదించాల్సిందిగా కమిషనర్ సూచించారు.

📞 సమన్వయం కోసం సంప్రదించాల్సిన నంబర్లు:
📱 040-29565758
📱 040-29560596

హైడ్రా ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ వెల్లడించారు.