365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 2,2025:హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ 1070 అందుబాటులోకి వచ్చింది. ఈ నంబర్‌కు కాల్ చేసి ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.
చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలు అక్రమంగా ఆక్రమించబడిన సందర్భాల్లో వెంటనే ఈ టోల్‌ఫ్రీ ద్వారా సమాచారం అందించాలని ఆయన సూచించారు.
అదేవిధంగా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో – చెట్లు కూలిపోవడం, వర్షాలు ముంచెత్తడం, అగ్ని ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా 1070 నంబర్ ద్వారా సహాయ సేవలు పొందవచ్చని తెలిపారు.

సెల్ నంబర్లు కూడా అందుబాటులో
ఓఆర్ఆర్ పరిధిలోని ప్రభుత్వ, ప్రజా ఆస్తుల పరిరక్షణకు 8712406899 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, వాట్సాప్ ద్వారా సంబంధిత ఫోటోలు, వీడియోలు పంపవచ్చని కమిషనర్ తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లేదా భారీ వర్షాల వల్ల కాలనీలు, రహదారులు నీట మునిగినా, అగ్ని ప్రమాదాలు సంభవించినా వెంటనే 8712406901, 9000113667 నంబర్లకు సంప్రదించవచ్చని సూచించారు.
Read This also…Indus Towers Transforms 17.3 Million Lives in FY25, Driving Inclusive Growth Across India..
ప్రజలు టోల్‌ఫ్రీ 1070తో పాటు ఈ మూడు సెల్‌ఫోన్ నంబర్లను వినియోగించి సహాయాన్ని పొందవచ్చని హైడ్రా కమిషనర్ సూచించారు.