365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్11,2023: సైకాలజీ రంగానికి ఊపిరి పోసి, ఓ ధైర్యం.. ఓ భరోసా హిప్నో కమలాకర్ కల్పించారని నవభారత లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సి.హెచ్. గోపాల్ కృష్ణ అన్నారు. ఈరోజుల్లో సైకాలజీ గురించి అందరికీ అవగాహన వచ్చిందంటే కమలాకర్ గారే కారణమన్నారు.
మానసిక సమస్యలు ఇలా ఉంటాయని కూడా తెలియజేసింది ఆయనేనని తెలిపారు. ఈరోజు ఆయన లేనిలోటు ను సమాజంలోఎవరూ భర్తీ చేయలేరని ఆయన తెలిపారు.
ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా, నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని బేగంబజార్ ఎస్.ఆర్.డి.రెయిన్ బో హోమ్ లో డా.హిప్నో కమలాకర్ 57వ జయంతి 2 వ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు అన్నదానం, పోషకాహారం, పుస్తకాలు అందజేసి కమలాకర్ కు ఘనంగా నివాళి అర్పించారు.

సామాజిక సమానత్వం కోసం, సమాజంలో జనాలను చైతన్య పరిచేలా హిప్నో కమలాకర్ కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. అంతేకాకుండా కమలాకర్ ” ఫైటర్”, వంటి 100 పుస్తకాలు రాసిన రచయితే కాకుండా, గొప్ప మానవతా వాది కూడా అన్నారు.
సినియర్ అడ్వకేట్ జి.కృష్ణవేణి మాట్లాడుతూ కమలాకర్ ఒక టీచర్, లాయర్, జర్నలిస్టు, సామాజికవేత్త, అని కొనియాడారు.
డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ ఒక గొప్ప మానవతా వాది అని అన్నారు. విలువ కట్టలేని నీ మనసుకి నా జోహార్లు.. అని స్టూడెంట్ ప్రసన్న నరసింహ అన్నాడు. ఈ కార్యక్రమంలో జి.హిమకర్, ఎస్.ఆర్.డి.రెయిన్ బో హోమ్ హెడ్ పార్వతి, విద్యార్థులు పాల్గొన్నారు.