Thu. Nov 7th, 2024

Trailer link – https://www.youtube.com/watch?v=6L7l7o_hTHM

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 9,2022:సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తదుపరి చిత్రం, యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన పృథ్వీరాజ్ కాగా, ఇది వారికి మొదటి చారిత్రాత్మక చిత్రం. ఇది నిర్భయమైన ,శక్తివంతమైన సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం, పరాక్రమం ఆధారంగా తెరకెక్కించారు. అతను క్రూరమైన దండయాత్రలు చేసిన మహమ్మద్ ఘోరీ నుంచి భారతదేశాన్ని రక్షించేందుకు ధైర్యసాహసాలతో పోరాడిన యోధుని పాత్రను అక్షయ్ పోషించారు. అక్షయ్ నేడు ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించి, పృథ్వీరాజ్ స్క్రిప్ట్‌ను డా.చంద్రప్రకాష్ ద్వివేది (పద్మశ్రీ) తనకు వివరించినప్పుడు తనకు కలిగిన మొదటి స్పందనను వెల్లడించారు. పృథ్వీరాజ్ సినిమా ట్రైలర్‌ను ఇక్కడ వీక్షించండి: (LINK)

దీని గురించి అక్షయ్ మాట్లాడుతూ “సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ కథను అందరూ చూడాలని కోరుకుంటున్నాను. నేను సినిమా కథనాన్ని విన్నప్పుడు, నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. స్క్రిప్ట్ నన్ను చాలా ఆకట్టుకోవడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించాను. ఇది అత్యుత్తమ స్క్రిప్ట్, ఇది చరిత్ర, దేశభక్తి, మనం జీవించాల్సిన విలువల చిత్రణను ఒకచోట చేర్చే వాస్తవమైన అన్వేషణ,చాలా అరుదుగా కనిపించే ప్రేమ కథను కూడా చెబుతుంది’’ అని పేర్కొన్నారు. దీని గురించి ఆయన మరింత వివరిస్తూ, “ప్రేక్షకుడిగా నేను సినిమాలో కోరుకునేవి అన్నీ ఇందులో ఉన్నాయి. ఇటువంటి చారిత్రాత్మకతకు అర్హమైన భారీ స్థాయి నిర్మాణం కూడా ఇందులో ఉంది.

మనకు తెలిసిన భారతదేశం కోసం ఎంతో చేసిన వ్యక్తి పాత్రను పోషించడం ఏ నటు డికైనా నిజంగా దక్కే గౌరవం కనుక నేను అవకాశాన్ని వదులుకోలేదు’’ అని వివరించారు.అక్షయ్ మాట్లాడుతూ, “నటుడిగా, నేను అటువంటి కథలకు జీవం పోయగలిగితే అది నా అదృష్టం.పృథ్వీరాజ్ మా ప్రేమతో కూడిన శ్రమ. తన చివరి శ్వాస వరకు మన దేశం, దేశప్రజల కోసం

నిలబడిన ఆ మహానుభావుడైన రాజుకు మనం ఎంత విశ్వసనీయంగా,ఎంత అద్భుతంగా నివాళులర్పించగలమో అని ప్రతి క్షణం ఆలోచిస్తున్నాను’’ అని తెలిపారు.టెలివిజన్ తెరపై అద్భుతమైన ధారావాహిక చాణక్య,విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం పింజర్‌కి దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు డా.చంద్రప్రకాష్ ద్వివేది ఇప్పుడు పృథ్వీరాజ్‌కు దర్శకత్వం వహించారు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్‌కు ప్రియమైన సంయోగిత పాత్రలో అందాల నటి మానుషి చిల్లర్ నటించారు. ఆమె ఈ చిత్రం ద్వారా పరిచయం కావడం 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టాల్లో ఒకటి. ఈ చిత్రం హిందీ, తమిళం,తెలుగు భాషల్లో జూన్ 3న విడుదల కానుంది.

error: Content is protected !!