365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 8,2024 : జస్టిస్ హేమ కమిటీ నివేదిక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై కమిటీ నివేదికను విడుదల చేసింది. చాలా కాలం నుంచి నటీమణులంతా తమ వేధింపుల గురించి చెబుతూనే ఉన్నారు. తాజాగా హేమ కమిటీ నివేదికపై సీనియర్ నటి సిమ్రాన్ స్పందించారు. తాను కూడా ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక..
జస్టిస్ హేమ కమిటీ నివేదికలు మలయాళ చిత్ర పరిశ్రమనే కాకుండా ఇతర సినిమా పరిశ్రమలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ పరిశ్రమలకు చెందిన కొందరు సినీ నటీనటులు కూడా తమ ఇండస్ట్రీలోనూ ఇలాంటి కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఈ నేపథ్యంలో ఒకప్పటి స్టార్ నటి సిమ్రాన్ కూడా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పి అందరినీ షాక్‌కు గురిచేసింది.
“మహిళలు లైంగిక వేధింపులను వెంటనే ఎందుకు పట్టించుకోరు..? ఇలా ప్రశ్నించడం అసహ్యంగా ఉంది. సంఘటన జరిగిన తర్వాత ఎలా చెప్పగలం.. ? ఆ సమయంలో మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి తగినంత సమయం పడుతుంది. ఎలా స్పందించాలో తెలియదు. అందుకే సమయం, అవకాశం వచ్చినప్పుడు నేను వారి గురించి చాలాసార్లు చెప్పలేదు అని ఆమె ఇటీవలి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత మలయాళ సినీ కళాకారుల సంఘం (ఏఎంఏ) అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేశారు.