Sun. Sep 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,ఆగస్టు 20,2024:ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమ నిర్వహణలోని అసెట్స్ ‌పరంగా (ఏయూఎం) కీలకమైన రూ. 3 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. 2024 జూలై 31 నాటికి కంపెనీ ఏయూఎం రూ. 3.14 లక్షల కోట్లుగా ఉంది.

వివిధ వ్యాపార విభాగాలవ్యాప్తంగా 2024 జూన్ నాటికి 9.84 కోట్ల లైవ్స్‌కి కంపెనీ జీవిత బీమా కవరేజీ అందించింది. 2022 జూన్‌లో నమోదైన 6.19 లైవ్స్‌తో పోలిస్తే ఇది సుమారు 59 శాతం అధికం. 2024 జూన్ 30 నాటికి అమల్లో ఉన్న మొత్తం సమ్ అష్యూర్డ్ రూ. 35.10 లక్షల కోట్లుగా ఉంది.

కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 2024 ఆర్థిక సంవత్సరంలో 99.17 శాతంగా ఉండగా, నాన్-ఇన్వెస్టిగేటెడ్ రిటైల్ డెత్ క్లెయిమ్‌లకు సంబంధించి టర్నెరౌండ్ సమయం సగటున కేవలం 1.27 రోజులుగా ఉంది. కస్టమర్లను బట్టి సరైన ఉత్పత్తిని సరైన ధరకు సరైన మాధ్యమంలో అందించడం ద్వారా మెరుగైన అనుభూతి కల్పించే దిశగా టెక్నాలజీని వినియోగించుకుని జీవిత బీమాను సరళతరం చేసేందుకు కంపెనీ కట్టుబడి ఉంది.

“రూ. 3 లక్షల కోట్ల ఏయూఎం మైలురాయిని అధిగమించడం మాకు సంతోషకరమైన విషయం. సరైన కస్టమరుకు సరైన ధరకు సరైన మాధ్యమం ద్వారా సరైన ఉత్పత్తిని అందించాలన్న మా విధానమనేది, కవర్ చేసే లైవ్స్ సంఖ్య 59 శాతం వృద్ధి చెందడానికి దోహదపడింది. 2022 జూన్‌లో ఇది 6.19 కోట్లుగా ఉండగా 2024 జూన్‌లో 9.84 కోట్ల లైవ్స్‌కి చేరింది.

కస్టమర్లు మాపై ఉంచిన నమ్మకానికి ఈ విజయాలు నిదర్శనమని మేము విశ్వసిస్తున్నాం. కస్టమర్లు తమకు, తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు మాపై ఆధారపడుతున్నందున, మేము మా కస్టమర్ల పొదుపులకి ట్రస్టీలుగా, కస్టోడియన్లుగా వ్యవహరిస్తున్నాం.

జీవిత బీమా అనేది సమాజం ఆర్థిక భద్రత, సంపద సృష్టి, రిటైర్మెంట్ ఆదాయం వంటి ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది. మా ఉత్పత్తులు, ప్రక్రియలు ఈ అవసరాలను తీర్చేందుకు అనుగుణంగా ఉంటున్నాయి” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనూప్ బాగ్చీ తెలిపారు.

error: Content is protected !!