Thu. Oct 10th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై,సెప్టెంబర్ 11,2024: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరదల బారిన పడిన వ్యక్తుల నామినీలు/లబ్ధిదారుల కోసం క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సరళతరం చేసింది.

ప్రకృతి వైపరీత్యంతో తలెత్తిన విషాద తీవ్రతను గుర్తించి బాధిత కుటుంబాలకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించే దిశగా డెత్ క్లెయిమ్‌లను వేగవంతంగా పరిష్కరించేందుకు కంపెనీ కట్టుబడి ఉంది.

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)లో భాగమైన వాటితో పాటు అన్ని క్లెయిమ్‌లు కేవలం మూడు (3) ప్రాథమిక డాక్యుమెంట్ల ఆధారంగా ప్రాసెస్ చేశాయి.  

క్లెయిమ్‌లను రైజ్ చేసేందుకు నామినీలు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు:

·         IFSC కోడ్‌తో బ్యాంకు అకౌంటు నంబరు లేదా బ్యాంక్ అకౌంటు క్యాన్సిల్డ్ చెక్కు కాపీ

·         స్థానిక మున్సిపల్ అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం. ఒకవేళ డెత్ సర్టిఫికెట్ లేకపోతే ఆస్పత్రులు, ప్రభుత్వాధికారులు లేదా పోలీసులు జారీ చేసిన మృతుల జాబితానైనా నామినీలు సమర్పించవచ్చు.

·         పాన్ కార్డు/ఫారం 60 వంటి చెల్లుబాటయ్యే కేవైసీ పత్రాల కాపీలు, ఇటీవలి ఫొటో, అధికారికంగా చెల్లుబాటయ్యే ఏదైనా డాక్యుమెంటు (ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడీ, NREGA జాబ్ కార్డు లేదా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ జారీ చేసిన లెటర్)

క్లెయిమ్ సంబంధ సందేహాలేవైనా ఉంటే నివృత్తి కోసం కంపెనీకి చెందిన 24X7 క్లెయిమ్ కేర్ హెల్ప్‌లైన్ నంబరు 1800-2660కి నామినీలు/లబ్ధిదారులు కాల్ చేయొచ్చు.

ప్రత్యామ్నాయంగా తమ క్లెయిమ్‌లను రైజ్ చేయడానికి క్లెయిమెంట్లు claimsupport@iciciprulife.com కి మెయిల్ చేయొచ్చు లేదా  ICLAIM <space> పాలసీ నంబరు రాసి 56767కి ఎస్ఎంఎస్ చేయొచ్చు లేదా www.iciciprulife.com/claimsని సందర్శించవచ్చు.

“ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద బాధిత కుటుంబాలకు మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ విషాదంతో తలెత్తిన డెత్ క్లెయిమ్‌లన్నింటిని కేవలం మూడు ప్రాథమిక పత్రాల ప్రాతిపదికన వేగవంతంగా సెటిల్ చేస్తాం. క్లెయిమెంట్లు తమకేవైనా సందేహాలుంటే మా 24X7 క్లెయిమ్‌కేర్ హెల్ప్‌లైన్ 1800-2660కి కాల్ చేయొచ్చు. 

అలాగే, క్లెయిమెంట్లు తమ క్లెయిమ్‌లను తెలిపేందుకు మా డిజిటల్ సాధనాలైన మొబైల్ యాప్, వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు లేదా ఎస్ఎంఎస్ పంపించవచ్చు. క్లెయిమ్‌ల పరిష్కారం విషయంలో మా కస్టమర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు మేము కట్టుబడి ఉన్నాం.

2025 ఆర్థిక సంవత్సరం Q1లో పరిశ్రమలోనే అత్యుత్తమంగా సగటున 1.21 రోజుల క్లెయిమ్ సెటిల్మెంట్ టర్నెరౌండ్ సమయంతో 99.35% క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని నమోదు చేయడం ఇందుకు నిదర్శనం” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ శ్రీ అమీష్ బ్యాంకర్ (Amish Banker) తెలిపారు.

error: Content is protected !!