365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 24, 2025: భారత్‌కు వచ్చే దశాబ్దం ‘ఆవిష్కరణల దశాబ్దం’ కానుందని, ట్రస్టెడ్ ఏఐ, డీప్‌టెక్, విస్తరించిన ఆర్ అండ్ డీలే దీనికి మూలస్తంభాలని ప్రకటిస్తూ సీఐఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ & స్టార్టప్స్ (సీఐఐ సీఐఈఎస్) టీ-హబ్‌లో ఐకాన్ సమిట్-2025ను సోమవారం ఘనంగా ప్రారంభించింది.
ప్రారంభోపన్యాసం చేసిన తెలంగాణ ఐటీ & పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, “సైబర్ సెక్యూరిటీ, బయోలాజిక్స్, అత్యాధునిక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏఐ హబ్‌ను రూపొందిస్తున్నాం. ట్రస్టెడ్ ఏఐ, బయోటెక్ ఆధారిత ఆవిష్కరణలు, తర్వాతి తరం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో హైదరాబాద్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చడమే మా లక్ష్యం” అని ప్రకటించారు.

సీఐఐ సీఐఈఎస్ సలహా మండలి ఛైర్మన్, ఆక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, “కార్పొరేట్లు-స్టార్టప్‌ల భాగస్వామ్యమే జాతి నిర్మాణం. భారత్‌లోని కుటుంబ వ్యాపారాలు ఏకమై బహుళ బిలియన్ డాలర్ల డీప్‌టెక్ వెంచర్ ఫండ్స్ ఏర్పాటు చేయాలి. బలమైన ఐపీఆర్ వ్యవస్థ లేకుండా దీర్ఘకాలిక ప్రపంచ పోటీతత్వం సాధ్యం కాదు. ఈ ఊపు కొనసాగితే వికసిత భారత్ 2047 నిజంగా సాధ్యమవుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
సీఐఐ ఉపాధ్యక్షురాలు డాక్టర్ శ్రీమతి సుచిత్ర ఎల్ల, “ఆర్ అండ్ డీ రంగానికి పరిశ్రమా హోదా ఇవ్వాలి. దీంతో పెట్టుబడులు, అంతర్జాతీయ నైపుణ్యం, అకాడమియా-ఇండస్ట్రీ సహకారం పెరిగి భారత్ సైన్స్-టెక్నాలజీలో ప్రపంచ నాయకుడవుతుంది” అని పిలుపునిచ్చారు.
సీఐఐ నేషనల్ స్టార్టప్ కౌన్సిల్ కో-ఛైర్మన్ శ్రీ సీకే రంగనాథన్, “స్టార్టప్‌లు, కార్పొరేట్లు, ఇన్వెస్టర్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వం – అందరినీ ఒకేవేదికపైకి తెచ్చిన ఐకాన్ సమిట్ భారత ఇన్నోవేషన్ భవిష్యత్తును రూపొందించే మైలురాయి” అని కొనియాడారు.
ప్రధాన ఆకర్షణలు

- సీఐఐ స్టార్టప్రెన్యూర్ అవార్డ్స్ 2025 విజేతల ప్రకటన
- “ఇంజినీరింగ్ హార్డ్‌వేర్ స్టార్టప్ ఎకోసిస్టమ్” నివేదిక విడుదల
- “డెమోక్రటైజింగ్ యాక్సెస్ టు ఫైనాన్స్ ఇన్ ఇండియా” నివేదిక విడుదల
- “ఉమెన్ ఇన్ ఇన్నోవేషన్” కాంపెండియం ఆవిష్కరణ
సీఐఐ సీఐఈఎస్ మార్కెట్ యాక్సెస్ కార్యక్రమాలు, యూకే-జపాన్ వంటి దేశాలతో భాగస్వామ్యాలు, ఫ్యామిలీ ఆఫీస్ మాస్టర్‌క్లాసులు కూడా సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
