365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 24,2023:వేసవి అయినా, చలికాలమైనా ప్రతి సీజన్‌లోనూ ఫ్యాన్‌ ను వినియోగిస్తారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడానికి లేదా విద్యుత్ బిల్లులు పెరగకుండా ఉండటానికి ప్రజలు వివిధ రకాల చిట్కాలను అనుసరిస్తారు.

ఇంట్లో అన్నిటికంటే ముఖ్యమైంది ఫ్యాన్. దీనిని దాదాపు అన్ని ఇళ్లలో ఉపయోగిస్తూనే ఉంటారు. 1-2 లేదా 4-5 నంబర్‌లో ఫ్యాన్‌ను నడపడం వల్ల విద్యుత్ బిల్లు తగ్గుతుందని చాలా మందికి అపోహ ఉంది.

ఫ్యాన్ అతివేగంగా నడిస్తే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని, అందుకే ఫ్యాన్ స్పీడ్ ను 4 లేదా 5 కాకుండా 2,3 మధ్యలో మాత్రమే ఉంచితే కరెంటు బిల్లు తక్కువ వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ కరెంటు బిల్లుకు ఫ్యాన్‌ స్పీడ్‌కి సంబంధం ఏమిటి..?

ఫ్యాన్ తిరగడానికి ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది..? అనేది దాని వేగంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఫ్యాన్ ఏ నెంబర్ వద్ద ఎంత కరెంటు వినియోగిస్తుందో తెలుసా? రిమోట్ ఏసీ వేగాన్ని నియంత్రిస్తున్నట్లే, ఫ్యాన్ వేగాన్ని రెగ్యులేటర్ నియంత్రిస్తుంది. ఫ్యాన్ ఎంత విద్యుత్తును ఉపయోగిస్తుంది అనేది రెగ్యులేటర్‌పై ఆధారపడి ఉంటుంది.

ఫ్యాన్లలో రెండు రకాల రెగ్యులేటర్లు ఉంటాయి. కొన్ని రెగ్యులేటర్లు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేస్తాయి, అయితే కొన్ని రెగ్యులేటర్ల విద్యుత్ వినియోగంతో ఎటువంటి సంబంధం ఉండదు.

కేవలం ఫ్యాన్ వేగాన్ని మాత్రమే నియంత్రిస్తాయి. వోల్టేజీని తగ్గించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించే రెగ్యులేటర్‌ కలిగిన కొన్ని ఫ్యాన్లు కూడా వస్తున్నాయి.

రెగ్యులేటర్ ఫ్యాన్‌లో రెసిస్టర్ పాత్రను పోషిస్తుంది, అంటే ఫ్యాన్ లోపల వోల్టేజ్ తగ్గినప్పుడు, ఫ్యాన్ తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది కానీ విద్యుత్ ఆదా అవ్వదు.

అందువల్ల, మీరు ఫ్యాన్‌ను 2-3 నంబర్ లేదా 4-5 నంబర్‌లో ఉంచినా, అది విద్యుత్ వినియోగాన్ని ప్రభావితం చేయదు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తి వేగంతో ఫ్యాన్‌ని నడపవచ్చు.