Mon. Dec 23rd, 2024
tax-collections

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, బెంగళూరు, అక్టోబర్18,2022: బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆదాయ వనరుగా ఉన్న ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడిన అధికారులకు బదిలీ శిక్ష విధించాలని సీనియర్ అధికారులు ప్రతిపాదించారు. అందుకు ప్రతి అధికారికి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నామని, అది నెరవేరకపోతే సదరు అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేయాలని బీబీఎంపీ లక్ష్యంగా పెట్టుకుంది.

దీని ప్రకారం అక్టోబరు 8 వరకు రూ.2,497.58 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయగా.. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యం పన్నులో 59.61శాతం వసూలు చేశారు. ఇంకా 40.39శాతం ఆస్తిపన్ను వసూలు చేయాల్సి ఉంది. తద్వారా మిగిలిన ఐదు నుంచి ఆరు నెలల్లో 100శాతం పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించాలన్నది బీబీఎంపీ రెవెన్యూ విభాగం ప్రణాళిక.

tax-collections

టాక్స్ వసూళ్లకు సంబంధించి అధికారులు, సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశిస్తూ.. పాటించకుంటే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బిబిఎంపి రెవెన్యూ విభాగం నిర్ణయించిన విధంగా ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ నుంచి జోనల్ కమిషనర్ వరకు లక్ష్యాన్ని నిర్ణయించారు. పన్ను బకాయిల నుంచి రూ.10 లక్షల వరకు పన్ను వసూలు చేయాలని ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లను ఆదేశించారు.

అదే విధంగా అసిస్టెంట్ రెవెన్యూ అధికారులకు రూ.10 నుంచి రూ.25 లక్షలు, రెవెన్యూ అధికారులకు, జోనల్ డీసీలకు రూ.25 నుంచి రూ.50 లక్షలు వారి నుంచి 100శాతం బకాయిలు, ప్రస్తుత పన్నులు వసూలు చేయాలని ఆదేశించింది బీబీఎంపీ.

error: Content is protected !!