megastar-chiranjeevi

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, నవంబర్ 20,2022:మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2022కు మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి దక్కింది. గోవాలో ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)53వ ఎడిషన్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని ప్రకటించారు.

నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్టమైన చలనచిత్ర జీవితంలో, చిరంజీవి తెలుగులో 150కి పైగాసినిమాల్లో నాటించారు. తెలుగులోనేకాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషలలో కొన్ని చిత్రాలలో ఆయన నటించారు. మెగాస్టార్ చిరంజీవిని సినిమా అత్యంత విజయవంతమైన, ప్రభావవంతమైన నటులలో ఒకరిగా పరిగణించబడ్డారు.

megastar-chiranjeevi

“పునాదిరాళ్ళు” సినిమాతో తెలుగు చలనచిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన లో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఉత్సాహభరితమైన డ్యాన్స్ ,ఫైట్స్ తో జనాలను ఆకట్టుకున్నారు. దీంతో మెగాస్టార్ అనే బిరుదును సొంతం చేసుకోగలిగారు చిరంజీవి.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 53వ ప్రారంభోత్సవ కార్యక్రమ వేదికపై కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్రమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్‌తో కలిసి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2022ను ప్రకటించారు. సినిమా, జనాదరణ పొందిన సంస్కృతి ,సామాజికంగా చిరంజీవి చేసిన కృషిని గుర్తిస్తూ మెగాస్టార్‌కు ఈ అవార్డు ను ప్రకటించారు.

megastar-chiranjeevi

అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నటుడిగా, డ్యాన్సర్ గా ,నిర్మాతగా 150కి పైగా చిత్రాలతో అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉన్నారని అన్నారు. “ఆయన తెలుగు సినిమాల్లో అపారమైన ప్రజాదరణ పొందారు, అద్భుతమైన నటనతో ప్రజల హృదయాలను హత్తుకున్నారు!” అని మంత్రి వెల్లడించారు.

గతంలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్ బచ్చన్, సలీం ఖాన్, బిస్వజిత్ ఛటర్జీ, హేమా మాలిని, ప్రసూన్ జోషి వంటి సినీ ప్రముఖులు ఈ అవార్డు అందుకున్నారు. ఆతర్వాత ఈ అవార్డు చిరంజీవి అందుకోనున్నారు.