365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 8, 2020: ఇటీవల ఢిల్లీ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేసిన ఒక 45 ఏళ్ల వ్యక్తికి రెండు రోజుల పాటు తన శరీరంలో ఒకవైపు బలహీనంగా అనిపించడంతో అతడిని మెడికవర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడిని పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాత అతడికి ‘బ్రెయిన్ స్ట్రోక్’ వచ్చిందని గుర్తించారు. ఆ విషయం తెలిక, ఆసుపత్రికి వెళ్తే కరోనా వస్తుందన్న భయంతో సరైన సమయానికి చికిత్సకు రాలేదు. అయినా, ఆసుపత్రిలో చేరిన వెంటనే చికిత్స చేసి, పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత ఇంటికి పంపారు.
మెడికవర్ ఆసుపత్రికి ప్రతివారం కనీసం రెండు కేసులు ఇలాంటివి వస్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలా సమయం తర్వాత వాళ్లు చికిత్సలకు వస్తున్నారు! ఆసుపత్రికి వెళ్తే కరోనా సోకుతుందన్న భయంతోనే వాళ్లిలా చేస్తున్నారు. సరైన సమయానికి రాకపోవడం వల్ల చాలామంది ఈ సమస్యతో మరణిస్తారు కూడా. సరైన సమయానికి చికిత్స అందించగలిగితే వారిలో 80% మందిని బతికించుకోవచ్చు. దీనివల్ల వచ్చే ముప్పు, కలగాల్సిన అవగాహన గురించి మెడికవర్ ఆసుపత్రుల కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ సీమాంచల్ మిశ్రా మాట్లాడుతూ, ‘‘ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాపించిన ఈ తరుణంలో పరిస్థితి చాలా విషమించిన తర్వాతే రోగులు ఆసుపత్రికి వస్తున్నారు! ‘బ్రెయిన్ స్ట్రోక్’ వచ్చినప్పుడు సరైన సమయానికి చికిత్స అందించినప్పుడే వాళ్ల ప్రాణాలను కాపాడగలం. నేరుగా రోగిని చూడకుండా వాళ్లకు సరైన మందులు ఇవ్వలేం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగికి ఐవీ ఇంజెక్షన్ రూపంలో ‘‘టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివీటర్ (టీపీఏ)’’ ఇవ్వాలి. స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 4-5 గంటలను గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ సమయంలోనే ఈ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ల ప్రాణాలు కాపాడగలం.

అందువల్ల, ఏదైనా ఆరోగ్య సమస్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమయం వృథా చేయకుండా తగిన వైద్యం పొందడం చాలా ముఖ్యం’’ అని తెలిపారు.దేశంలోని ప్రతి నగరంలో ప్రతి యేటా అంటువ్యాధులు కానివి, కొవిడ్-19తో సంబంధం లేని వ్యాధుల వల్ల వేలాది మంది మరణిస్తున్నారు. వీటిలో బ్రెయిన్ స్ట్రోక్ లాంటి కొన్నింటి వల్ల మరణం సంభవించే ముప్పు బాగా ఎక్కువ. అందువల్ల ఈ విషయమై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. రోగులకు వైరస్ రహిత ప్రాంతాల్లో చికిత్స చేయడంలో మెడికవర్ ఆసుపత్రులు అత్యుత్తమమైనవి. కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదే అయినా, ఇతర ఆరోగ్య సమస్యలకు సమయానికి చికిత్స అందించకపోవడం దానికంటే ప్రమాదకరం కావచ్చు