365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, నవంబర్30,2024: న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF) 2024లో, సెబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “భారత్ కా షేర్ బజార్” పెవిలియన్‌లో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) కీలక పాత్ర పోషించింది.
ఈ కార్యక్రమం సందర్శకులకి సెక్యూరిటీస్ మార్కెట్ పరిజ్ఞానం అందించడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై అవగాహన కల్పించడంలో ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.
ప్రతీ సంవత్సరం నవంబర్ 14 నుంచి 27 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో AMFI గత మూడు సంవత్సరాలుగా సెబీ ఆధ్వర్యంలో పాల్గొంటూ వస్తోంది. లక్షలాది సందర్శకులు, ముఖ్యంగా యువత, ఈ ట్రేడ్ ఫెయిర్‌ను సందర్శిస్తారు.
వారిలో చాలా మంది “భారత్ కా షేర్ బజార్” పెవిలియన్‌ను కూడా సందర్శించి పెట్టుబడిదారుల అవగాహనకు సంబంధించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈసారి AMFI, 20 అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల (AMCs) సహకారంతో, ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై ప్రాథమిక సమాచారాన్ని సందర్శకులకు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
సందర్శకులను ఆకట్టుకునేలా క్విజ్‌లు, పజిల్స్, ప్రెజెంటేషన్‌లు, ఇంటరాక్షన్‌లు వంటి ఆసక్తికరమైన కార్యక్రమాలను నిర్వహించింది.
అంతేకాక, నవంబర్ 22,23 తేదీలలో “చాంపియన్స్ ఆఫ్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్‌నెస్ అవార్డ్స్ 2024” పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది.
నవంబర్ 22న మహిళా విద్యావేత్తల ప్రాముఖ్యతను గుర్తించి, ఆరుగురు మహిళా విద్యావేత్తలకు పురస్కారాలు అందజేసింది.
ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత పర్సనల్ ఫైనాన్స్ రచయిత Ms. మోనికా హలన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నవంబర్ 23న నిర్వహించిన కార్యక్రమంలో సెబీ మాజీ WTM ఎం.ఎస్. సాహూ ముఖ్య అతిథిగా పాల్గొనగా, AMFI చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ ఎన్. చలసాని గౌరవ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా, సెబీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.పీ. గార్గ్ ,ఏబిఎస్ఎల్ ఏఎంసీ ఇన్వెస్టర్ అవగాహన విభాగం హెడ్ కే.ఎస్. రావు ప్రత్యేక సహకారానికి గాను సత్కరించారు. శారీరక ఆరోగ్యం మరియు ఆర్థిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించడానికి AAIMS రిషికేష్ ప్రొఫెసర్ Dr. సంతోష్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు.
వేల మంది సందర్శకులు AMFI ఎన్‌క్లోజర్‌ను సందర్శించారు. “భారత్ కా షేర్ బజార్” ఈ ఏడాది “పబ్లిక్ కమ్యూనికేషన్ అండ్ ఔట్‌రీచ్” విభాగంలో ఐఐటిఎఫ్ ఐటీపీవో గోల్డ్ మెడల్ అవార్డును గెలుచుకుంది.