365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 15, 2025:ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీ సికందర్.

సినిమాలు, టీవీ షోలు,ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన IMDB (www.imdb.com) నేడు ప్రపంచవ్యాప్తంగా IMDBకి 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ద్వారా నిర్ణయించిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది.

నెం.1 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీ సికందర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ “2025 ఐఎండిబి మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో సికందర్ అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.

అతని శక్తి ,అంకితభావం సికందర్ సినిమాను మాటల్లో వర్ణించలేని విధంగా చేశాయి. అందుకు సహకరించిన సాజిద్ నదియాడ్ వాలాకు ధన్యవాదాలు. అయన సికిందర్ లో ప్రతి సన్నివేశం చెరగని ముద్ర వేసేలా తీర్చిదిద్దారు. ప్రేక్షకులతో ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రతి క్షణాన్ని డిజైన్ చేయడం కోసం నేను మనస్పూర్తిగా పనిచేశాను”

2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్:

  1. సికందర్
  2. టాక్సిక్
  3. కూలీ
  4. హౌస్ ఫుల్ 5
  5. బాఘీ 4
  6. రాజా సాబ్
  7. వార్ 2
  8. ఎల్2: ఎంపురాన్
  9. దేవా
  10. చావా
  11. కన్నప్ప
  12. రెట్రో
  13. థగ్ లైఫ్
  14. జాట్
  15. స్కై ఫోర్స్
  16. సితారే జమీన్ పర్
  17. థామా
  18. కాంతారా ఏ లెజెండ్: చాప్టర్ 1
  19. ఆల్ఫా
  20. తండెల్

2025 లో విడుదలయిన భారతీయ సినిమాలలో ఈ చిత్రాలు స్థిరంగా IMDB వినియోగదారులలో అత్యంత ప్రజాదరణ పొందాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా IMDBకి 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ద్వారా నిర్ణయించింది.

ఈ జాబితాలోని 20 టైటిల్స్ లో 11 హిందీ సినిమాలు, మూడు తమిళ, తెలుగు, రెండు కన్నడ, ఒకటి మలయాళ సినిమా కావడం గమనార్హం. హౌస్ ఫుల్ 5 (నెం.4), కన్నప్ప (నెం.11), స్కై ఫోర్స్ (నెం.15) వంటి మూడు చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించగా, రష్మిక మందన్న: సికందర్ (నెం.1), చావా (నెం.10), థమా (నెం.17). మోహన్ లాల్, ప్రభాస్, పూజా హెగ్డే, కియారా అద్వానీ లు రెండేసి చిత్రాల్లో నటిస్తున్నారు. హౌస్ ఫుల్ 5 (నెం.4), బాఘీ 4 (నెం.5), వార్ 2 (నెం.7), సితారే జమీన్ పర్ (నెం.16), కంతారా ఎ లెజెండ్: చాప్టర్ 1 (నెం.18).

IMDB కస్టమర్ లు అందుబాటులో ఉన్నప్పుడు అలర్ట్ లను తెలుసుకోవడం కొరకు వీటిని ,ఇతర టైటిల్స్ ను తమ IMDB వాచ్ లిస్ట్ కు జోడించవచ్చు. 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ వీడియోను చూడండి ,పూర్తి జాబితాను ఇక్కడ చూడండి.