Fri. Oct 18th, 2024
grapes-station365telugu

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఫిబ్రవరి 16,2023: రాజేంద్రనగర్ లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ విద్యార్థుల పరిశోధన కోసం గైడెన్స్ అందిస్తోంది.

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా జాతీయ, బహుళజాతి కంపెనీల కోసం అనేక పెయిడ్ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ స్టేషన్‌లో మొక్కలు, నేల, నీటిని విశ్లేషించే సౌకర్యాలు ఉన్నాయి.

పలు ద్రాక్ష రకాలకు చెందిన కుండీలలో పెరిగేలా ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ద్రాక్ష జ్యుస్ రకాలు, టేబుల్ వెరైటీస్, ఎండుద్రాక్ష రకాలు మూల్యాంకనం పరిశోధన పని జరుగుతోంది.

grapes-station365telugu

థాంప్సన్ సీడ్‌లెస్ పనితీరు అధ్యయనంలో ఉంది. ద్రాక్షలో బయోఇంటెన్సివ్ వ్యాధి నిర్వహణ ,సమర్థత అధ్యయనం చేస్తున్నట్లు గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ హెడ్, సైన్టిస్ట్ (హార్టికల్చర్), డా.కె. వెంకట లక్ష్మి వెల్లడించారు.

1975 నుంచి ఆల్ ఇండియా కో-ఆర్డినేటెడ్ ఫ్రూట్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం(ఏఐసీఆర్ఫీ) కింద పనిచేస్తోంది. 2013 నుంచి ఏఐసీఆర్ఫీ (పండ్లు) కిందకు వచ్చింది. ఇది దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ ప్రాంతంలోకి వస్తుంది.

జ్యుస్ ద్రాక్షలో పోషకాలు, చక్కెర, సహజ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. ప్రొసైనిడిన్స్, రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్ వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి.

ఇవి యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. అంతేకాకుండా అనేక రకాల క్యాన్సర్, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి.

ఇక్కడ జరిగిన పరిశోధనల ఫలితంగా రెండు రకాల జ్యుస్ వెరైటీస్. H-516 (ARI 516) మంజరి మెడిక, టేబుల్ వెరైటీ మంజరి శ్యామలను తెలంగాణ రాష్ట్రానికి సిఫార్సు చేశారు.

grapes-station365telugu

(పంట ప్రమాణాలపై కేంద్ర ఉపసంఘం, ఉద్యానవన పంటల రకాల నోటిఫికేషన్,విడుదల (CVRC) అండ్ గెజిట్ నోటిఫికేషన్). ఫర్టిగేషన్, ద్రాక్షలో దిగుబడి ,

నాణ్యతను ఆప్టిమైజ్ చేయడానికి ఒక అభ్యాసం, లోటు నీటిపారుదల షెడ్యూల్- ద్రాక్షలో నీటిని పొదుపుగా మార్చడానికి సరికొత్త సాంకేతికతను పరిశోధనా కేంద్రం విడుదల చేసింది.

రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోధనా కేంద్రంలో అరవై ఒక్క విభిన్నమైన టేబుల్, రైసిన్, జ్యూస్, వైన్ రకాల ద్రాక్షలు పండు దశలో ఉన్నాయి.

మరికొన్ని రోజుల్లో వేలం జరిగినతరువాత ప్రజల కోసం ఎగిబిషన్ అండ్ సేల్స్ కు అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. సైన్స్ డేలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని డా.కె. వెంకట లక్ష్మి వెల్లడించారు.

error: Content is protected !!