365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా,హైదరాబాద్,ఫిబ్రవరి 3,2022: భారతదేశంలో గత నాలుగు సంవత్సరాలలో అమేజాన్ బిజినెస్ ప్రయాణం ఏ విధంగా గడిచింది?2017లో ఇది ఆరంభమైన నాటి నుండి,  తమ విభిన్నమైన వ్యాపార అవసరాలకు  సరఫరా చేయడానికి ప్రముఖ శ్రేణిలలో 15 కోట్లకు పైగా జీఎస్టీ సదుపాయం గల ఉత్పత్తులతో  కీలకమైన గమ్యస్థానంగా ఎంఎస్ఎంఈలకు సాధికారిత కలిగించడానికి అమేజాన్ బిజినెస్ లక్ష్యాన్ని కలిగి ఉంది.  ఎంఎస్ఎంఈలు, పోటీయుత ధరలు ,విస్త్రతమైన డెలివరీ నెట్ వర్క్ కి లభించే విస్త్రతమైన ఎంపిక వలన అన్ని వ్యాపార అవసరాలుకోసం ఇది కీలకమైన గమ్యస్థానంగా మారింది.  భారతదేశం వ్యాప్తంగా 99.5% పిన్ కోడ్స్ తో, దేశంలో సుదూర ప్రాంతాలు నుండి వ్యాపారాలు తమ కొనుగోళ్లు అవసరాలు కోసం అమేజాన్ బిజినెస్ పై ఆధారపడవచ్చు.

మేము భారతదేశంలో అతి పెద్ద జీఎస్టీ స్టోర్ గా నిలిచాము,గత నాలుగేళ్లల్లో, మేము చేర్చిన కొన్ని ఫీచర్లు ద్వారా వ్యాపారాలు సులభంగా జీఎస్టీ ఇన్ వాయిస్,ఆధునిక వ్యాపార విశ్లేషణా సాధనాల్ని  పొందవచ్చు, దీని ద్వారా వారు వ్యాపారం కొనుగోలు చేసిన ప్రతిసారీ జీఎస్టీ ఇన్ వాయిస్ తో వారు అదనపు ఆదాల్ని లెక్కించగలరు.

అదనంగా,  వ్యాపారాలు మారుతున్న అవసరాలకు కేటాయింపు చేయడానికి మేము ఉత్పత్తుల్ని చేర్చడం కొనసాగించాము. కొన్ని ఉదాహరణలు, మేము ప్రముఖ శ్రేణిల్లో వ్యాపార ల్యాప్ టాప్స్, నెట్ వర్కింగ్ డివైజ్ లు, పారిశ్రామిక అడ్ హెసివ్స్ వంటివి,  సాధనాలు,సామగ్రి,భద్రత,రక్షణ పరికరాల్ని లెనోవో, సిస్కో, పిడిలైట్, కింబర్లీ క్లార్క్, స్టేన్లీ బ్లాక్ అండ్ డెకర్, కిర్లోస్కర్ వంటి ప్రముఖ బ్రాండ్స్ లో  వేలాది ఉత్పత్తులతో కమర్షియల్ స్టోర్ ని ఆరంభించాము. అదే విధంగా, ప్రత్యేకమైన కోవిడ్ సప్లై స్టోర్ ని సృష్టించడం ద్వారా పని చేసే ప్రదేశంలో శానిటైజేషన్ కోసం ఎన్నో సరఫరాల్ని చేర్చడం పై మేము దృష్టి సారించాము.  దీని ద్వారా వ్యాపారాలు పీపీఈ కిట్స్, మాస్క్స్, ఫేస్ షీల్డ్స్,శానిటైజర్స్ వంటి అవసరమైన ఉత్పత్తుల శ్రేణిని కొనుగోలు చేయవచ్చు.

విస్త్రతమైన ఎంపికకి అదనంగా, శక్తివంతమైన బట్వాడా నెట్ వర్క్ అనేది కస్టమర్లు తమ కొనుగోళ్లని మరింత సమర్థవంతంగా చేయడానికి,మరింత ఆదా చేయడానికి సహాయపడటానికి వ్యాపార సంబంధిత ఫీచర్లని చేర్చడం మేము చేసిన ప్రయత్నాలలో ఒకటి. మల్టి-యూజర్ అకౌంట్ ఫీచర్ ద్వారా అకౌంట్ భద్రత ,అనుసరణని మెరుగుపరచడానికి ఒక వ్యాపార అకౌంట్ లో బహుళ యూజర్లని చేర్చవచ్చు, క్వాంటిటీ డిస్కౌంట్స్ పొందడానికి పెద్ద మొత్తం కొనుగోలు ఫీచర్స్  ,40 % వరకు మరింత ఆదా చేయడం, క్రెడిట్ వంటి  వ్యాపార  సంబంధిత చెల్లింపు ఫీచర్స్ వంటి ఫీచర్లని వేగంగా అనుసరించడాన్ని మేము చూసాము.

మా విక్రేత భాగస్వాములు కోసం, అమేజాన్ బిజినెస్ లక్షలాదిమంది వ్యాపార కస్టమర్లు నుండి అవసరాల్ని తీర్చడం,వారి మార్గాల్ని వృద్ధి చేయడం ద్వారా తమ బీ2బీ వ్యాపారాన్ని పెంచడానికి Amazon.in పై అదనపు అవకాశాన్ని కేటాయించింది. ఎంఎస్ఎంఈ కస్టమర్లు నుండి అవసరాల్ని తీర్చడానికి అదనంగా, మా విక్రేతలు మహీంద్రా, జీఈ, టాటా గ్రూప్ వంటి పెద్ద ఎంటర్ ప్రైజెస్,అవసరాలు సహా దేశవ్యాప్తంగా వ్యాపారాలు నుండి వచ్చిన ఆర్డర్లకు కూడా సేవలు అందించారు. క్వాంటిటీ డిస్కౌంట్ కోసం అభ్యర్థన’ వంటి ఫీచర్స్ ద్వారా, మా విక్రేతలు దేశవ్యాప్తంగా వ్యాపారాలు నుండి లక్షలాది భారీ ఆర్డర్లకు సేవలు అందించారు.  మా విక్రేత భాగస్వాములు తమ ఆదాయ మార్గాల్ని వృద్ధి చేయడానికి అమేజాన్ బిజినెస్ ని ఒక ముఖ్యమైన సాధనంగా చూడటం,మా వేదిక పై 2017లో 14 వేలు విక్రేతలు నుండి 2021లో 4 లక్షలు + వరకు విక్రేతలు వృద్ధి చెందడం మాకు ఆనందంగా ఉంది.

.2021లో అమేజాన్ బిజినెస్ ఏ విధంగా సామర్థ్యం చూపించింది ? 2022 గురించి మీరు ఏమి ఊహించారు?

2021లో, అమేజాన్ బిజినెస్ భారతదేశంలో లక్షలాది చిన్న వ్యాపారాలను  కస్టమర్లుగా నమోదు చేసింది, గడిచిన ఏడాదితో పోల్చినప్పుడు  70%  కి పైగా కస్టమర్‌ల సంఖ్యలో విస్తారమైన వృద్ధిని కొనసాగించి  యూ.ఎస్ తరువాత  భారతదేశపు రెండవ అతి పెద్ద మార్కెట్ ప్రదేశంగా  అమేజాన్ బిజినెస్ ని తయారు చేసింది. చిన్న పట్టణాలు నుండి 30%కి పైగా కొనుగోలు చేసిన కస్టమర్లు,25% ఆర్డర్లు లభించి టైర్ 2 ,టైర్ 3 మార్కెట్స్ కూడా ఈ వృద్ధిలో గణనీయమైన బాధ్యతవహించాయి.

భారతదేశంలో లక్షలాది చిన్న వ్యాపారాలు నిలదొక్కుకునే విధంగా అమేజాన్ బిజినెస్ వారికి మద్దతు ఇవ్వడంలో కీలకమైన బాధ్యతవహించింది. డబ్ల్యూఎఫ్ హెచ్ ఫర్నిచర్, రౌటర్స్, హెడ్ ఫోన్స్, కీబోర్డ్స్, ఆఫీస్ స్టేషనరీ వంటి ఎలక్ట్రానిక్ ఎసన్షియల్స్  వంటి శ్రేణుల్లో  వేలాది ఉత్పత్తుల్ని చేర్చడం ద్వారా తమ వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాల్ని తీర్చడానికి  గత ఏడాదిగా, మేము మా విక్రేత భాగస్వాములతో సన్నిహితంగా పని చేస్తున్నాము. మా కస్టమర్లకు సహాయపడటానికి,  మరింత ఆదా చేయడానికి, మేము  నెలలో చివరి వారంలో నెలవారీ సేల్  కార్యక్రమం ‘బిజినెస్ వేల్యూ డేస్’ ని మేము ఆరంభించాము, దీని ద్వారా మా కస్టమర్లు  వ్యాపార ప్రత్యేక డీల్స్,ప్రోత్సాహాలు పై ఐఎన్ఆర్ 7.5 కోట్లకు పైగా  అదనపు ఆదాల్ని పొందారు.

సరైన కస్టమర్ అనుభవాన్ని రూపొందించడానికి ఈ ఏడాది అమేజాన్ బిజినెస్ కస్టమర్ పై అత్యధికంగా దృష్టి సారించడాన్ని కొనసాగిస్తుంది. మా కస్టమర్లు ఏ విభాగానికి చెందిన వారైనా, తమ అవసరాల్ని తీర్చడానికి మేము ఉత్తమమైన ఎంపికగా ఉన్నంత కాలం మమ్మల్ని ఎంచుకుంటారు. మా వ్యాపార కస్టమర్లకు సౌకర్యవంతమైన,కొత్త సాంకేతికతతో కూడిన కొనుగోళ్లు పరిష్కారాలు కేటాయించ డాన్ని మేము కొనసాగిస్తాము,వ్యాపారాలకు తమ అవసరాలు కోసం కీలకమైన గమ్యస్థానంగా ఉండటానికి కృషి చేస్తాము.అదనంగా,  విక్రేతల్ని నిరంతరమైన విధానంలో కనక్ట్ అవడం ద్వారా  డిమాండ్స్ తీర్చడమే మా లక్ష్యం. అమేజాన్ బిజినెస్  మా మూడు కీలకమైన వృద్ధి  స్థంభాలైన ఎంపిక, ధరలు, సౌకర్యం పై రూపొందడాన్ని కొనసాగిస్తుంది.

ప్రముఖ బ్రాండ్ ప్రారంభాలు, పెద్ద ఎత్తున కొనుగోళ్లు కోసం ఉత్తేజభరితమైన వ్యాపార డీల్స్,కస్టమర్లు కోసం కొత్త ఆవిష్కరణలను తీసుకురావడానికి మా ఎంపికని పెంచడం పై మా దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది.

.2021లో అమేజాన్ బిజినెస్ ప్రారంభించిన కొన్ని చొరవలు ఏమిటి ?

2021లో, మా కస్టమర్లు కోసం పూర్తి కొనుగోలు అనుభవాన్ని సరళం చేయడం పై మేము మా దృష్టి కేంద్రీకరించడాన్ని కొనసాగించాము,మహమ్మారి తరువాత సాధారణ పరిస్థితికి సర్దుబాటు అవడంలో వారికి సహాయపడటానికి ఫీచర్స్ ప్రారంభించాము.

కొత్త కస్టమర్లు కోసం నమోదు చేసే  అనుభవాన్ని సరళం చేయడానికి ఈ సంవత్సరం మేము ఆరంభించిన ఆవిష్కరణల్ని వ్యాపారాలు కోసం అనుభవాన్ని సరళం చేయడానికి ఉదాహరణగా చెప్పవచ్చు. వ్యాపారాలు ఇప్పుడు మా వేదిక పై 2 నిముషాలు లోగా నమోదు చేయవచ్చు, వాస్తవిక సమయంలో ధృవీకరణ పొందవచ్చు, అందువలన వారు వెంటనే అమేజాన్ బిజినెస్ ప్రయోజనాల్ని పొందడం ఆరంభించవచ్చు,ఆదా చేయడం  ఆరంబించవచ్చు. ఐఎన్ఆర్ 20 లక్షలు కంటే తక్కువ వార్షిక టర్నోవర్ తో ఎంఎస్ఎంఈలకు సేవలు అందించడానికి ,జీఎస్టీ సర్టిఫికెట్ లేని ఎన్జీఓలు కోసం మేము బిజినెస్ పాన్ ని ఆరంభించాము. ఇది ఒక అదనపు లైసెన్స్ రకం. దీని ద్వారా వారు నమోదు కావచ్చు,అమేజాన్ బిజినెస్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ వ్యాపారాలకు ఇంతకు ముందు లభించని వ్యాపార ప్రత్యేక డీల్స్, భారీ డిస్కౌంట్స్, ఇతర వ్యాపార సంబంధిత ఫీచర్స్ వంటి ఎన్నో ప్రయోజనాల్ని ఇప్పుడు  పొందగలరు.

వ్యాపారాలు కొత్త సాధారణ పరిస్థితికి సర్దుకోవడంలో సహాయపడటానికి,వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాటులో దూరం నుండి తమ వ్యాపారాల్ని నిర్వహించడానికి, మేము ‘బిల్ టు షిప్ టు’ ఆరంభించాము. ఈ ఫీచర్ ద్వారా, అమేజాన్ బిజినెస్ ఈ విలక్షణమైన కస్టమర్ సమస్యని పరిష్కరించడంలో నాయకత్వంవహించింది, తమ పాన్-ఇండియా షిప్ మెంట్స్ కోసం తమ బిల్లింగ్ చిరునామా పై జీఎస్టీ క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి ఇది వారికి పరిష్కారాన్ని అందచేసింది. ఈ సౌకర్యవంతమైన ఫీచర్ కస్టమర్లు తమ మొత్తం పన్ను క్రెడిట్ ని ఒక రాష్ట్రానికి ఏకీకృతం చేయడానికి ,జీఎస్టీ క్రెడిట్ ని మరింత ప్రభావవంతంగా ఉపయోగించడానికి సహాయపడింది.

.దీపావళి 2021/గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 సమయంలో ఏబీకి కస్టమర్ ప్రతిస్పందన ఏ విధంగా ఉంది?

2021 పండగల సీజన్ సమయంలో, మా వ్యాపార కస్టమర్స్ కోసం అమేజాన్ బిజినెస్ స్మార్ట్ ఫోన్స్, ఉపకరణాలు, టీవీలు, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ల్యాప్ టాప్స్, పీసీలు, హోమ్ అండ్ కిచెన్,ఇంకా ఎన్నో శ్రేణిలలో ప్రముఖ బ్రాండ్స్ నుండి విస్త్రతమైన  ఉత్పత్తుల ఎంపిక పై అమేజాన్ బిజినెస్ అద్భుతమైన డీల్స్ ని రూపకల్పన చేసింది. అదనంగా, తమ అమేజాన్ బిజినెస్ అకౌంట్ కి లాగింగ్ ఇన్ చేయడం ద్వారా బహుమతులు ఇవ్వడానికి,తమ సొంత వాడకానికి వ్యాపార సంబంధిత ఎంపిక పై మా కస్టమర్లకు ప్రత్యేకమైన ఆఫర్లు పొందడానికి అవకాశం లభించింది,వారికి కొత్త ప్రారంభాలకు  కూడా అవకాశం కలిగింది. భారీ మొత్తంలో కొనుగోలు చేసే వ్యాపారాలు క్వాంటిటీ డిస్కౌంట్లలో 40% వరకు పొందగలిగారు. ఐఎన్ఆర్ 50,000 కంటే అధికంగా కొనుగోలు చేయడం పై వారు ప్రత్యేకమైన 5% క్యాష్ బ్యాక్ కూడా పొందారు.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో డీల్స్ తో పాటు, అమేజాన్ బిజినెస్ వ్యాపార బహుమతుల అవసరాలు తీర్చడానికి   ‘కార్పొరేట్ గిఫ్టింగ్ స్టోర్  ‘ ని కూడా పరిచయం చేసింది. ఈ స్టోర్ ద్వారా, కస్టమర్లు భారీ మొత్తంలో కార్పొరేట్ బహుమతుల్ని సులభంగా,సౌకర్యవంతంగా కొనుగోలు చేయవచ్చు. బిజినెస్ ల కూడా అవసరాలకు అనుగుణంగా కార్పొరేట్ బహుమతుల్ని తయారు చేసి,వ్యక్తిగతం చేసే ఎంపికని కలిగి ఉన్నాయి.

. దీపావళి సేల్ సమయంలో మా కస్టమర్లు నుండి వచ్చిన ప్రతిస్పందనతో ఆనందించాము,ఈ విషయాలు గమనించాము:

.360 వేలకు పైగా ఎంఎస్ఎంఈ బయ్యర్లు పాల్గొన్నారు.

.2020తో పోల్చినప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో అమేజాన్ బిజినెస్ తో వ్యాపార ఖాతాని తయారు చేసిన కొత్త ఎంఎస్ఎంఈలలో 46%కి పైగా పెంపుదల కలిగింది.

.ఈ సమయంలో 10 వేలకు పైగా భారీ ఆర్డర్లు వచ్చాయి, 2020 కంటే 47% పెంపుదల కనిపించింది.

.వేలాది విక్రేతలు బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డీల్స్ అందించారు.

.2020తో పోల్చినప్పుడు ఆర్డర్లలో 132%  పెంపుదలతో టైర్ 2,టైర్ 3 మార్కెట్లలో వ్యాపారాలు నుండి అనూహ్యమైన ప్రతిస్పందన.

.వ్యాపార కస్టమర్లు వివిధ అవసరాల్ని తీర్చడానికి  ప్రత్యేకంగా  రూపొందించబడిన  కార్పొరేట్ గిఫ్టింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, బ్యాక్ టు వర్క్ స్టోర్స్ వంటి స్టోర్స్ నుండి కస్టమర్స్ 15 వేలకు పైగా ఉత్పత్తుల్ని కొనుగోలు చేసారు.