inbase smart watch
inbase smart watch

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, ఏప్రిల్ 2, 2022: ఇన్‌బేస్‌ Inbaseతమ పూర్తి సరికొత్త అర్బన్‌ లైఫ్‌ఎం(Urban Lyf M) స్మార్ట్‌ వాచ్‌ను విడుదల చేసింది. పూర్తి వైవిధ్యంగా ఉండటంతో పాటుగా భారీ , స్పష్టమైన డిస్‌ప్లేను కలిగిన ఈ స్మార్ట్‌వాచ్‌ అతి తేలికగా ఉండ టంతో పాటుగా మహోన్నతమైన పనితీరునూ ప్రదర్శిస్తుంది. ఈ స్మార్ట్‌ వేరబల్‌ను మీ రోజువారీ సహచరునిగా ఉండేలా తీర్చి దిద్దారు. అందు బాటులోని స్మార్ట్‌వాచ్‌లకు పూర్తి భిన్నంగా ఇన్‌బేస్‌ అర్బన్‌ లైఫ్‌ ఎం ఉంటుంది. మీ రోజువారీ భావోద్వేగాలకు తగినట్లుగా 200కు పైగా అత్యంత అందమైన క్లౌడ్‌ ఆధారిత వాచ్‌ ముఖాలను ఇది కలిగి ఉంది. అలాగే ఆహ్లాదకరమైన వినియోగదారుల అనుభవాల కోసం హానీకాంబ్‌ లేదా గ్రిడ్‌ శైలి ఇంటర్‌ఫేస్‌కు మారేందుకు డ్యూయల్‌ ఏఐ ఫంక్షన్‌ తోడ్పడుతుంది.

inbase smart watch

అత్యాధునిక రియల్‌టెక్‌ చిప్‌సెట్‌ ఉపయోగించి తీర్చిదిద్దిన ఇన్‌బేస్‌ అర్బన్‌ లైఫ్‌ ఎం పనితీరు పరంగా మెరుగ్గా ఉండటంతో పాటుగా అత్యాధునిక ఫీచర్లనూ కలిగి ఉంది. లైఫ్‌ ఎంలో అసాధారణ బ్యాటరీ ఉంది. రెండు గంటలలో పూర్తిగా చార్జ్‌ కావడంతో పాటుగా 8 రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీని స్టాండ్‌బై సమయం 30 రోజులు. రన్నింగ్‌, వాకింగ్‌, స్కిప్పింగ్‌, సైక్లింగ్‌, బాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌,స్విమ్మింగ్‌ వంటివి వ్యక్తిగత శిక్షకునిగా లైఫ్‌ ఎం లో భాగంగా ఉంటాయి. ఈ వాచ్‌ జింక్‌–అల్లాయ్‌ కేసింగ్‌ తో వస్తుంది. చర్మానికి హాని కలిగించని సిలికాన్‌ స్ట్రాప్‌ ఉంది. దీనిలో అత్యున్నత నాణ్యత కలిగిన స్వెట్‌ రెసిస్టెంట్‌ కూడా ఉంది. యాక్టివేటెడ్‌ వాయిస్‌ అసిస్టెంట్‌తో మీరు మీ డివైజ్‌తో కమ్యూనికేట్‌ చేయవచ్చు. Inbase

inbase smart watch

ప్రైస్ ఎంతంటే..?

ఇన్‌బేస్‌ అర్బన్‌ లైఫ్‌ ఎం స్మార్ట్‌వాచ్‌ ధర 3999 రూపాయలు. విని యోగదారులు ఈ వాచ్‌ను 12 నెలల వారెంటీతో అధిక వెబ్‌సైట్‌ www.inbasetech.in వద్ద లేదా ఇతర అగ్రగామి స్టోర్ల వద్ద పొందవచ్చు. ఇన్‌బేస్‌ అర్బన్‌ లైఫ్‌ ఎం అత్యద్భుతమైన రంగుల అవకాశాలు-బ్లాక్‌ డయల్‌తో బ్లాక్‌ స్ట్రాప్‌, వయొలెట్‌ స్ట్రాప్‌తో రోజ్‌ గోల్డ్‌ డయల్‌ లేదా గ్రే స్ట్రాప్‌తో సిల్వర్‌ డయల్‌ లో వస్తుంది.