365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్ హైదరాబాద్,జూలై 10, 2021;హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక వ్యాపార సంస్థపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, నిర్మాణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యర్ధాలను శుద్ధి చేసే కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సంస్థ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు హైదరాబాద్ లో సాగుతుండగా, వ్యర్ధాల నిర్వహణ కార్యకలాపాలు దేశవ్యాపితంగా జరుగుతున్నాయి.
సోదాల్లో సంస్థ ఆర్ధిక అక్రమాలకు, అవకతవకలకు పాల్పడుతున్నట్టు తెలియజేసే పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ 2018-18 ఆర్ధిక సంవత్సరంలో సంస్థ మెజారిటీ వాటాలను సింగపూర్ కి చెందిన ఒక ప్రవాస సంస్థకు విక్రయించి భారీగా మూలధన లాభాలను ఆర్జించినట్టు సోదాల్లో గుర్తించారు. ఆ తరువాత ఈ లాభాలను నష్టాలుగా చూపించడానికి సంస్థ కొనుగోలు,అమ్మకం,మనుగడలో లేని సంస్థలతో లావాదేవీలను నిర్వహించినట్టు ఆకర్షణీయ పథకాలను రూపొందించడం, వీటిపై బోనస్ చెల్లించడంలాంటి అక్రమాలకూ పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. మూలధన లాభాలను నష్టాలుగా చూపించడానికి అక్రమాలకూ పాల్పడినట్టు చూపించే పత్రాలు,సాక్ష్యాలను అధికారులు గుర్తించారు. సోదాల్లో సంస్థ 1,200 కోట్ల రూపాయల నష్టాన్ని రికార్డుల్లో చూపించింది. ఈ మొత్తానికి పన్ను విధించవలసి ఉంటుంది.
ఇంతేకాకుండా, సంస్థ 288 కోట్ల రూపాయలను వసూలు కాని బకాయిలుగా రికార్డుల్లో చూపించి మినహాయింపు కోరింది. అయితే, ఈ మొత్తాన్ని సంస్థ తన లాభాలనుంచి మినహాయించి చూపించడం జరిగింది. ఈ చట్టవ్యతిరేక మినహాయింపుకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు సోదాల్లో స్వాదీనం చేసుకున్నారు.సంస్థకి చెందిన వర్గాలతో నిర్వహించిన లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను కూడా అధికారులు గుర్తించారు. దీనికి అనుసరించిన విధానం, మొత్తం కూడా ఒకేవిధంగా ఉన్నాయి. ఆదాయం పన్ను అధికారులు నిర్వహించిన సోదాలు, తనిఖీలు, స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా తాము 300 కోట్ల రూపాయలకు పైగా రికార్డుల్లో చూపని ఆదాయాన్ని ఆర్జించామని అంగీకరించిన సంస్థ అనుబంధ సంస్థలు దీనిపై పన్ను చెల్లించడానికి అంగీకరించారు. దీనిపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.