365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 8,2023:దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఒకరోజు నష్టాల నుంచి పుంజుకున్నాయి.
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ కొన్ని సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపుతున్నాయి. ముడి చమురు ధరలు, యూఎస్ బాండ్ ఈల్డుల తగ్గుదల, డోజోన్స్ పుంజుకోవడం వంటి అంశాలు మార్కెట్లను నడిపిస్తున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 33, ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఫార్మా, రియాల్టీ రంగాలు దుమ్మురేపాయి. నిఫ్టీ 19,400 స్థాయిలో కన్సాలిడేట్ అయితే మరింత బుల్లిష్‌నెస్ వస్తుంది.

నాణ్యమైన షేర్లను డిప్స్‌లో కొనొచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.28 వద్ద ఫ్లాట్‌గా స్థిరపడింది. విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలు చేపట్టగా డీఐఐలు నెట్ బయర్స్‌గా అవతరించారు.
క్రితం సెషన్లో 64,942 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 65,101 వద్ద ఆరంభమైంది. సాంతం రేంజ్‌బౌండ్లోనే కొనసాగింది. 64,851 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై పుంజుకొని 65,124 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.
చివరికి 33 పాయింట్ల లాభంతో 64,975 వద్ద ముగిసింది. బుధవారం 19,449 వద్ద మొదలైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,401 వద్ద ఇంట్రాడే కనిష్ఠ స్థాయికి చేరుకుంది. 19,464 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.
మొత్తంగా 36 పాయింట్లు పెరిగి 19,443 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 79 పాయింట్లు ఎరుపెక్కి 43,658 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభపడగా 21 నష్టపోయాయి. బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, సిప్లా, టైటాన్ టాప్ గెయినర్స్‌గా అవతరించాయి.
ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫీ, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా కన్జూమర్ షేర్లు టాప్ లాసర్స్. నేడు ఫైనాన్స్, ఐటీ, ప్రైవేటు బ్యాంకు సూచీలు నష్టపోయాయి.
ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు లాభపడ్డాయి.
నిఫ్టీ నవంబర్ నెల టెక్నికల్ ఛార్ట్‌ను గమనిస్తే 19450 వద్ద సపోర్టు, 19,530 వద్ద రెసిస్టెన్సీ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలంలో ఎల్టీ, అదానీ పోర్టు, ఎస్బీఐ, ఐటీసీ, హిందుస్థాన్ యునీలివర్ షేర్లను కొనొచ్చు.
నేడు నిఫ్టీ రేంజ్‌బౌండ్‌లో కొనసాగడానికి ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ నష్టాలే కారణం. ఎల్టీ, రిలయన్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఏసియన్ పెయింట్స్ కాస్త ఆదుకున్నాయి.

ఇంగర్‌సోల్ రాండ్ రెండో త్రైమాసికం ఫలితాలు విడుదల చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఆదాయం 9 శాతం పెరిగి రూ.276 కోట్లకు పెరిగిందని వెల్లడించింది.
కావేరీ సీడ్స్ ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేదు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఆదాయం 2 శాతం తగ్గి రూ.4,021 కోట్ల నుంచి రూ.3,938 కోట్లకు చేరింది. నేడు అదానీ గ్రూప్ ఇన్వెస్టర్ల సంపదను రూ.21,000 కోట్ల మేర పెంచింది.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు ఒకటి నుంచి రెండు శాతం మేర పెరిగాయి.

ఐరోపా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో టెక్నాలజీ సేవలు అందించేందుకు ఇన్ఫోసిస్, ఏడబ్ల్యూఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709