Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 21,2023: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం అదరగొట్టాయి. బుధవారం నాటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి.

అయితే భారత గ్రోత్‌స్టోరీపై నమ్మకంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. నిన్నటి పతనంతో కొన్ని విలువైన కంపెనీల షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభించాయి. ఇండియా విక్స్ 4 శాతానికి తగ్గడం ఇన్వెస్టర్ల ఆత్మవిశ్వాసం పెంచింది.

ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, పవర్ గ్రిడ్ నిఫ్టీకి అండగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 83.26 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 70,506 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ 69,920 వద్ద మొదలైంది. ఉదయం నుంచి రేంజు బౌండ్లోనే కొనసాగింది. 69,920 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 70,958 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది.

మొత్తంగా 358 పాయింట్ల లాభంతో 70,865 వద్ద ముగిసింది. గురువారం 21,033 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,976 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 21,288 వద్ద గరిష్ఠాన్ని అందుకొంది.

ఆఖరికి 104 పాయింట్లు పెరిగి 21,255 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంకు 394 పాయింట్ల లాభంతో 47,840 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 38 కంపెనీలు లాభపడగా 12 నష్టపోయాయి. పవర్ గ్రిడ్, బీపీసీఎల్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు టాప్ గెయినర్స్. బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, సిప్లా షేర్లు టాప్ లాసర్స్.

నేడు అన్ని రంగాల సూచీలు కళకళలాడాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ పెరిగాయి.

నిఫ్టీ50 డిసెంబర్ ఫ్యూచర్స్ రెసిస్టెన్సీ 21500, సపోర్టు 21,200 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు నియర్ టర్మ్‌లో అరబిందో ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హిందుస్థాన్ యునీలివర్, బ్రిటానియా, కొటక్ బ్యాంకు షేర్లను కొనుగోలు చేయొచ్చు.

ఎలక్ట్రోలైట్స్ తయారీ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నామని అమి ఆర్గానిక్స్ తెలిపింది. నెట్‌వర్క్ 18లో రూ.85.80 చొప్పున 15.1 లక్షల షేర్లు చేతులు మారాయి. పూనావాలా ఫిన్‌కార్పులో రూ.434 చొప్పున 13.6 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఇండియన్ బ్యాంకు షేర్లు నేడు 9 శాతం మేర నష్టపోయాయి. కేపీ గ్రూప్ నుంచి సరికొత్త విడ్‌పవర్ ప్రాజెక్టు ఆర్డర్ రావడంతో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 4.49 శాతం ఎగిశాయి. హిందుస్థాన్ కాపర్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర ఎగిసి రూ.215 వద్ద ముగిశాయి.

ఇక్రా లాంగ్‌టర్మ్ AA+ రేటింగ్ ఇవ్వడమే ఇందుకు కారణం. కల్యాణీ స్టీల్స్ లిమిటెడ్ సీఎఫ్‌వో బాల్ ముకంద్ మహేశ్వరి రాజీనామా చేశారు. ఐటీ శాఖ నుంచి కోఫోర్జుకు రూ.97.98 కోట్ల టాక్స్ డిమాండ్ నోటీసు వచ్చింది.

మదర్‌సన్ సుమి వైరింగులో లార్జ్ ట్రేడ్ జరిగింది. 18.7 లక్షల షేర్లు చేతులు మారాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!