Sun. Sep 15th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, ఆగస్టు 28,2024: అథ్లెటిక్స్ కిడ్స్ కప్ అనేది పిల్లలు, యుక్తవయస్కుల కోసం చేపట్టిన సరికొత్త క్షేత్రస్థాయి స్పోర్ట్స్ కార్యక్రమం. యూబీఎస్ భాగస్వామ్యంతో స్విట్జర్లాండ్‌కి చెందిన ఔత్సాహిక అథ్లెటిక్స్ బృందం డీఎస్‌పవర్‌పార్ట్స్ (Dspowerparts) దీన్ని ప్రారంభించింది.

పిల్లల్లో శారీరక శ్రమను ప్రోత్సహించేందుకు, భారతీయ బాలల్లో పెరుగుతున్న ఊబకాయ సమస్య పరిష్కరంలో తోడ్పాటు అందించేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించింది. అథ్లెటిక్స్ కప్ ముంబై ప్రాంతంలో నిర్వహించనుంది.

వేల కొద్దీ సంఖ్యలో బాలల్లో శారీరక వ్యాయామాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం. అథ్లెటిక్స్ కిడ్స్ కప్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకోవాలని పాఠశాలలను ఆహ్వానిస్తున్నాం.

సరళమైన కాన్సెప్టు – గణనీయ ప్రభావం

అథ్లెటిక్స్ కిడ్స్ కప్ అనేది ప్రాథమికంగా మూడు రకాల చలనాలపై – రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్- ఆధారపడి ఉంటుంది. ప్రతి క్రీడలోను ఈ కదలికలు అవసరం. అథ్లెటిక్స్‌లో వీటిని మరింతగా అభ్యసించి, నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటారు.

ఈ పోటీలు ట్రయాథ్లాన్ తరహాలో ఉంటాయి. ఇందులో 60 మీటర్ల స్ప్రింట్, లాంగ్ జంప్, బాల్ థ్రో ఉంటాయి. అన్ని వర్గాలకు చెందిన 7 నుంచి 15 ఏళ్ల వయస్సు గల బాలలు, యుక్త వయస్కులు ఇందులో పాల్గొనవచ్చు.

క్రీడలు, ముఖ్యంగా అథ్లెటిక్స్ అనేవి వ్యక్తిగత అభివృద్ధి, ఆరోగ్య సాధన, అలాగే సామాజికంగా పరస్పర అవగాహనను పెంచుకునే ధోరణులను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయనే ఉద్దేశంతో అథ్లెటిక్స్ కిడ్స్ కప్ తీర్చిదిద్దింది. యువ పార్టిసిపెంట్లు తమ వ్యక్తిత్వాన్ని, విలువలను, సమగ్రతను, పరస్పర గౌరవ భావాన్ని, క్రమశిక్షణను మెరుగుపర్చుకునేందుకు ఇది ఒక చక్కని వేదిక కాగలదు.

తమలో దాగి ఉన్న అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, తమ ఉన్నత లక్ష్యాల సాధన కోసం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేలా బాలల్లో స్ఫూర్తి నింపేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.

ఊబకాయస్తుల సంఖ్య, ముఖ్యంగా పిల్లల్లో గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ ఆరోగ్యపరమైన సంక్షోభం ముంగిట్లో నిలిచి ఉంది. ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మెరుగుపర్చే సాధనంగా క్రియాశీలకమైన జీవన విధానాలను పాటించే విధంగా ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయం అందించాలనేది అథ్లెటిక్స్ కిడ్స్ కప్ లక్ష్యం.

కీలకంగా పాఠశాలలు

మొదటి సీజన్‌లో (2024/2025) అథ్లెటిక్స్ కిడ్స్ కప్ ముంబై ప్రాంతం ప్రధానంగా నిర్వహించనుంది. కాంపిటీషన్ మెటీరియల్స్, బిబ్ నంబర్స్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ లేదా పూర్తి హ్యాండ్‌బుక్ వంటి మెటీరియల్ ఉండే రెడీ-టు-యూజ్ టూల్‌కిట్ సాయంతో పాఠశాలలు స్వతంత్రంగా పాఠశాల స్థాయి పోటీలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డీఎస్‌పవర్‌పార్ట్స్ ,దాని భాగస్వామి స్ట్రైడర్స్ కలిసి పాఠశాలలకు అవసరమైన తోడ్పాటును అందిస్తాయి.

ఔత్సాహిక అథ్లెట్స్‌కి వేదిక

నేపథ్యం, ప్రతిభతో సంబంధం లేకుండా బాలలందరిలోను శారీరక వ్యాయామాన్ని ప్రోత్సహించడం ప్రధానోద్దేశం అయినప్పటికీ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ అనేది ఔత్సాహిక అథ్లెటిక్స్‌కి చక్కని వేదికగా కూడా ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. ఈ పోటీలు మూడు దశల్లో ఉంటాయి.

పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అత్యంత ప్రతిభావంతులైన బాలికలు, బాలురు 2025 జనవరిలో ముంబైలో జరిగే అయిదు ప్రాంతీయ ఫైనల్స్‌లో ఒకదానికి ఎంపికవుతారు. ఒక్కో వయస్సు కేటగిరీలో నుంచి టాప్ 30 మంది అథ్లెట్లు ఫిబ్రవరి 15న జరిగే గ్రాండ్ ఫినాలేలో తమ ప్రతిభను చాటేందుకు అవకాశం లభిస్తుంది.

అర్హత పొందిన యువ అథ్లెట్లకు ఒక మరపురాని అనుభూతిని కలిగించేలా ఈ పోటీలన్నీ ప్రొఫెషనల్ వాతావరణంలో నిర్వహించబడతాయి

2025/2026 సీజన్ విస్తరణ ప్రణాళికలు

నిర్వాహకులు దీన్ని మరింతగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. 2025/2026 సీజన్‌లో పుణె , హైదరాబాద్‌లకు కూడా అథ్లెటిక్స్ కిడ్స్ కప్‌ను విస్తరించేందుకు, రాబోయే నెలల్లో ఈ రెండు నగరాల్లోనూ పైలట్ ప్రాజెక్టులు నిర్వహిస్తారు.

క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని భారతదేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు, అలాగే భారతీయ బాలల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు,శారీరక శ్రమను ప్రోత్సహించేలా గణనీయమైన ప్రభావం చూపేందుకు ఈ విస్తరణ ప్రణాళికలు తోడ్పడగలవు.

ప్రభావవంతమైన మార్పులకు తోడ్పడుతున్న యూబీఎస్

స్విట్జర్లాండ్‌కి చెందిన యూబీఎస్ బ్యాంకు ఉదార మద్దతుతో ఈ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ నిర్వహణ సాకారమైంది. యూబీఎస్‌కి భారత్‌తో మూడు దశాబ్దాలుగా పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. అభ్యాస ఫలితాలను,విద్యార్థుల సంక్షేమాన్ని మెరుగుపర్చే కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీలకు సాధికారత కల్పించేందుకు, వారు తమ పూర్తి సామర్థ్యాలను కనుగొనడంలో తోడ్పాటు అందించేందుకు యూబీఎస్ కట్టుబడి ఉంది. భారత యువతరం అభివృద్ధి, విజయాల కోసం యూబీఎస్ తన వంతుగా చేస్తున్న కృషిలో భాగంగా అథ్లెటిక్స్ కిడ్స్ కప్ నిర్వహణ ఉండనుంది.

మరిన్ని వివరాలకు

Athletic Kids Cup (athleticskidscup.com)

error: Content is protected !!