365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ,జనవరి 31,2026: దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ శాఖలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 28,740 ఖాళీల భర్తీ కోసం భారత అంచె విభాగం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి.
అర్హతలేమిటి..?
ఇదీ చదవండి..బ్యాంకుల చూపు.. బడ్జెట్ వైపు.. పరుగు తీస్తాయా? వెనకడుగు వేస్తాయా?
Read this also..Gold and Silver Prices Plummet as Markets Brace for Union Budget 2026..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి (10th Class) ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషపై పట్టు తప్పనిసరి.
Read this also..Unicommerce Expands Logistics Portfolio with ‘Shipway Cargo’ for B2B and Quick Commerce..
ఇదీ చదవండి..శాటిలైట్ డేటాతో సాగు లెక్కలు: ఫిబ్రవరి 6న ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్న PJTAU
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఇతర నైపుణ్యాలు: కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి.
ఎంపిక విధానం – మెరిట్టే కీలకం!

ఈ నోటిఫికేషన్ లోని ప్రత్యేకత ఏమిటంటే, ఎలాంటి రాత పరీక్ష కానీ, ఇంటర్వ్యూ కానీ ఉండవు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల (GPA) ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన సాగే ఈ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపడతామని అధికారులు వెల్లడించారు.
దరఖాస్తు ప్రక్రియ..
ఆసక్తి గల అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను బలోపేతం చేసే దిశగా ఈ భారీ రిక్రూట్మెంట్ను ప్రభుత్వం చేపట్టింది.
