365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఢిల్లీ ,డిసెంబర్ 29,2020:వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ తీసుకుంటున్న చర్యల ఫలితంగా భారతదేశం కోవిడ్ మహమ్మారి మీద పోరులో కీలకమైన అనేక మైలురాళ్ళను దాటుతూ ఉంది. రోజువారీ కొత్త కేసులు ఈ రోజు చెప్పుకోదగినంత తక్కువ స్థాయికి చేరి 16,500 లోపు నమోదయ్యాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 16,432 మంది కోవిడ్ పాజిటివ్ గా తేలారు. ఇది 187 రోజుల తరువాత జరిగింది. 2020 జూన్ 25న రోజువారీ కేసులు 16,922 నమోదు కాగా ఇప్పుడు ఆ స్థాయికి చేరటం మళ్లీ ఇప్పుడే
దేశవ్యాప్తంగా కోవిడ్ చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఈ రోజుకు 2,68,581 కి చేరింది. మొత్తం ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసులలో చికిత్స పొందుతూ ఉన్నవారి వాటా మరింత తగ్గి 2.63% కు చేరింది. ఇది గత 24 గంటలలో 8,720 కేసుల నికర తగ్గుదలకు దారితీసింది.
కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండటం, కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అవుతున్న వారు తక్కువగా ఉండటం కారణంగా దేశంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య కోటికి దగ్గరవుతూ ఉంది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98,07,569 గా ఈ రోజు నమోదైంది. దీంతో కోలుకున్నవారి శాతం 95.92% కు చేరింది. చికిత్సలో ఉన్నవారికీ, కోలుకున్నవారికీ మధ్య తేడా ప్రస్తుతం 95,38,988 గా ఉంది.
గడిచిన 24 గంటలలో 24,900 మంది కోలుకున్నారు. వారిలో 77.66% మంది పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కేంద్రీకృతమయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 4,501 మంది కోలుకోగా, ఆ తరువాత స్థానంలో ఉన్న కేరళలో 4,172 మంది, చత్తీస్ గఢ్ లో 1,901 మంది కోలుకున్నారు.
కొత్తగా పాజిటివ్ గా తేలినవారిలో 78.16% మంది పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్నారు. కేరళలో నిన్న అత్యధికంగా 3,047 కేసులు రాగా, మహారాష్ట్రలో 2,498 చత్తీస్ గఢ్ లో 1,188 కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటలలో 252 మంది చనిపోగా వారిలో 77.38% మంది పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారే. మహారాష్ట్రలో నిన్న అత్యధికంగా 50 మంది చనిపోగా, పశ్చిమ బెంగాల్ లో 27 మరణాలు, చత్తీస్ గఢ్ లో 26 నమోదయ్యాయి.