Mon. Dec 23rd, 2024
Indian_Culinary

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌ ,11 జనవరి,2023:షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ కలినరీ ట్రెజర్స్‌ హంట్‌ నిర్వహించనున్నారు.

ఈ హంట్ ద్వారా భారతదేశ వ్యాప్తంగాఆధీకృత, వినూత్నమైన డిషెస్‌ను తయారుచేస్తూతమప్రాంతీయ వంటకాలను అత్యంత అందంగా ప్రదర్శించే హోమ్‌ కుక్స్‌ను గుర్తించనున్నారు.

http://dhunt.in/IepdC

ప్రతి ఒక్కరూ ఇంటిలో వండిన ఆహారానికి ప్రాధాన్యతనిస్తుంటారు. హోమ్ ఫుడ్ ప్రపంచంలోనే మరేదీ అందించలేని ఆనందం అందిస్తుంది. అందుకోసమే షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌ ఇప్పుడు హోమ్‌కుక్డ్‌ ఫుడ్‌ను తమ మెనూలో భాగంగా చేసింది.

ఎనిమిది విభిన్న ప్రాంతాలకు చెందిన క్యుసిస్‌లతో ఎనిమిది మంది హోమ్‌ కుక్‌లను ఒకే చోటికి ఈ ఇండియన్‌ కలినరీ ట్రెజర్‌ హంట్‌ ద్వారా తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది.

మాస్టర్‌ చెఫ్‌ తెలుగు సీజన్ -1 న్యాయనిర్ణేత మహేష్‌ పడాల, ఇండియన్‌ కలినరీ ట్రెజర్స్‌కు నేతృత్వం వహించనున్నారు. ఈయనతో పాటుగా ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ సంజయ్‌ రావత్‌, సుప్రసిద్ధ భారతీయ ఫుడ్‌ క్రిటిక్ సంకల్ప్‌ విష్ణులు ఈ పోటీలో హోమ్‌ కుక్స్‌ను గుర్తించనున్నారు.

http://dhunt.in/IepdC

ఈ పోటీల ముగింపులో భాగంగా ఈ హోమ్‌ కుక్స్‌తో షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌లోని ఫీస్ట్‌ రెస్టారెంట్‌లో తమ రుచులను చవిచూపనున్నారు.

Indian_Culinary

ఈ సందర్భంగా షెరటన్‌ హైదరాబాద్‌ హోటల్‌ జీఎం ప్రణయ్‌ వెర్డియా మాట్లాడుతూ ‘‘ఈ 2023లో హైదరాబాద్‌లో స్ధానికులతో పాటు అంతర్జాతీయ కమ్యూనిటీ కూడా సమావేశమయ్యే అత్యుత్తమ వేదికగా నిలువాలన్నది షెరటన్‌ లక్ష్యమన్నారు.

దేశవ్యాప్తంగా హోమ్‌ కుక్స్‌కు ఓ వేదికను అందించడానికి మించిన అత్యుత్తమ మార్గమేముంటుంది? మనమంతా మన కుటుంబ సభ్యులు మన కోసం ప్రేమ, అభిమానంతో వంట చేయడం చూసి ఉంటాము. వారికి వనరులు పరిమితంగా ఉంటాయి.

http://dhunt.in/IepdC

కానీ వారు తమ ప్రియమైన వారికి వంట చేస్తుంటారు కాబట్టి ఆ ఆహారం అత్యంత రుచికరంగా మారుతుంది. షెరటన్‌ వద్ద మేము ఈ ప్రేమ, అభిమానాన్ని మా కమ్యూనిటీ పట్ల ఈ ఇండియన్‌ కలినరీ ట్రెజర్‌ ద్వారా చూపాలనుకుంటున్నాము. ఈ మొత్తం కార్యక్రమం మా బ్రాండ్‌ లక్ష్యం ‘ద వరల్డ్స్‌ గేదరింగ్‌ ప్లేస్‌’కు అనుగుణంగా ఉంటుందని అన్నారు.

http://dhunt.in/IepdC

ఫుడ్‌ అండ్‌ బేవరేజస్‌ క్లస్టర్‌ డైరెక్టర్, చెఫ్‌ మహేష్‌ పడాల మాట్లాడుతూ ‘‘తినడం అనేది శరీరం కంటే మనసుకు సంబంధించిన అంశం’ అనే లియాన్‌ రాప్పోపోర్ట్‌ చెప్పిన విషయాన్ని బలంగా నమ్ముతుంటాను.

ఇండియన్‌ కలినరీ ట్రెజర్స్‌ ద్వారా హోమ్‌ కుక్స్‌ సిద్ధం చేసిన భారతీయ ప్రాంతీయ వంటకాల అందాన్ని ప్రదర్శించనున్నాము. ఆహారం, భావొద్వేగాల కలయిక, సంబంధాలను ఒడిసిపడుతుంది.

మానసికంగా,శారీరకంగా శక్తివంతం చేయడంలో ఆహారం తోడ్పడుతుందని మేము నమ్ముతాము, అంతేకాదు అది మనకు పునరుత్తేజమూ కలిగిస్తుంది. ఇంటిలో అమ్మ ప్రేమతో తీర్చిదిద్దే రుచులను కమర్షియల్‌ కిచెన్‌ల ద్వారా పునః సృష్టించడం కష్టం.

http://dhunt.in/IepdC

అయినప్పటికీ మేము వీలైనంతగా ఆధీకృత రుచులను అందించడానికి ప్రయత్నిస్తున్నాము. దేశవ్యాప్తంగా 8మంది హోమ్‌ కుక్స్‌ను ఒకే చోట తీసుకురావడమనేది వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందంగా ఉంది.

ఈ కార్యక్రమం ద్వారా హోమ్‌ కుక్స్‌ను కలుసుకోవడంతో పాటు ఆధీకృత వంటకాల రహస్యాలను తెలుసుకునే అవకాశం కూడా కలుగుతుందని అన్నారు.

Indian_Culinary

ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ ‘‘ ఫాస్ట్‌ ఫుడ్‌ను పొందడం చాలా సులభం. కానీ చాలా ఫ్యామీలీస్ హోమ్‌ కుకింగ్‌లోని ఆనందాన్ని కోల్పోతున్నాయి.

http://dhunt.in/IepdC

అంతేకాదు పోషకాహార, సామాజిక కారణాల దృష్ట్యా మన సంప్రదాయ హోమ్‌ ఫుడ్స్ ను మళ్ళీ తిరిగి అందుబాటులోకి తీసుకురావడం చాలా ముఖ్యమని అన్నారు.

error: Content is protected !!